Andhra Pradesh

News May 26, 2024

హైదరాబాద్ లాడ్జిలో రాయచోటి ఉపాధ్యాయుడి మృతి

image

హైదరాబాద్‌లో రాయచోటి ఉపాధ్యాయుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మియాపూర్ ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 26, 2024

వడమాలపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్ డెడ్

image

వడమాలపేట మండల పరిధిలోని పాదిరేడు బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను కంటైనర్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞ అనే మహిళ(35) అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పొన్నేరికి చెందిన విజయకాంత్, ప్రజ్ఞ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా పాదిరేడు బైపాస్ వద్ద వెనుక వస్తున్న కంటైనర్ ఢీకొంది .మృతదేహాన్ని పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.

News May 26, 2024

రాయలసీమ గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తాం: సీమ కృష్ణ రాథోడ్

image

రాయలసీమ సంప్రదాయాన్ని, విలువలను తప్పుగా చిత్రీకరిస్తూ మాట్లాడే వ్యక్తుల తాట తీస్తామని రాయలసీమ ఉద్యమ నాయకులు సీమ కృష్ణ రాథోడ్ హెచ్చరించారు. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం నడుస్తోందంటూ టీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ మాట్లాడటం పట్ల ఆయన స్పందించారు. రాయలసీమను తక్కువ చేసి మాట్లాడటం ఇతర ప్రాంతాల వారికి అలవాటుగా మారిందన్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.

News May 26, 2024

ప.గో.: పెన్సిల్‌పై ‘గెట్ రెడీ SRH’ 

image

IPL-2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విజయం సాధించాలని ఓ కళాకారుడు పెన్సిల్‌పై ఆంగ్లంలో గెట్ రెడీ SRH అంటూ చెక్కారు. ప.గో. జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొప్పినీడి విజయ్ SRH విజయాన్ని కాంక్షిస్తూ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. కాగా ఆయన లిఖితపూడి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. 

News May 26, 2024

రేపు 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు: APSDMA 

image

జిల్లాలో రేపటి నుంచి ఎండ ప్రభావం చూపనుందని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈమేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిరమండలం, లక్ష్మీనర్సుపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు (రెడ్అలెర్ట్ ) వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ మండలాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.

News May 26, 2024

మాచర్ల: ‘రెచ్చిపోతున్న వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలి’

image

పట్టణంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పాశవికంగా కత్తులతో స్వైర్య విహారం చేయడం పట్ల వారు ఆవేదన వెలిబుచ్చారు. తురక కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్ సుమారు 10కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. 

News May 26, 2024

చైనా కంపెనీ నిర్బంధంలో విశాఖ యువకుడు

image

చినముషిడివాడకు చెందిన తెరపల్లి రాజేష్(33) బ్యాంకాక్‌లో చైనీస్ కంపెనీ నిర్బంధంలో ఉన్నాడు. ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేసిన రాజేష్ థాయిలాండ్‌లో ఉద్యోగానికి గత నెల 25న బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈనెల 10న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇండియా వెళ్లాలంటే రూ.8 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తండ్రి శివకి చెప్పాడు. ఈ మేరకు తండ్రి విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు.

News May 26, 2024

తణుకులో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

image

ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తణుకు పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానిక ఎన్టీఆర్‌ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న చదలవాడ తిమోతి స్థానికంగా ఉంటున్న ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తిమోతీని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 26, 2024

కృష్ణా: తల్లి మందలించడంతో యువకుడి ఆత్మహత్య

image

కృష్ణా జిల్లా పెనమలూరు శివారు గంగూరులో ఆదివారం యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించిందనే కారణంతో భార్గవ్ (24) ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనమలూరు పోలీసులు తెలిపారు.

News May 26, 2024

కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. నిర్దేశించిన సమయానికి అందరూ తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు.