Andhra Pradesh

News May 26, 2024

సత్తెనపల్లి మీదుగా వెళ్లే రైళ్లు దారి మళ్లింపు

image

పల్నాడు జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో సత్తెనపల్లి మీదగా వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్‌లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు కాజీపేట, విజయవాడ మీదుగా గమ్య స్థలానికి వెళ్తాయన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరమ్మతు పనులు వేగవంతం చేశామని చెప్పారు.

News May 26, 2024

ఎన్టీఆర్: పాలీసెట్ రాసిన అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో పాలిటెక్నిక్ సీట్ల భర్తీకై నిర్వహించే వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ రేపు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి జూన్ 3వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని సంబంధిత వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, SRR కాలేజీ, ఆంధ్రా లయోలా కళాశాలలో వెబ్ కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

News May 26, 2024

ప.గో.: జనసేన అభ్యర్థులు గెలవాలని ప్రత్యేక పూజలు

image

సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు గెలవాలని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రత్యేకపూజలు చేయించారు. ప.గో. జిల్లా నరసాపురం మండలం LB.చర్ల గ్రామానికి చెందిన జనసైనికుడు కటకంశెట్టి సంజీవరావు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో పవన్‌కళ్యాణ్, నాయకర్ చిత్రపటాలతో కూర్చొని ప్రత్యేక పూజలు చేయించారు.

News May 26, 2024

VIDEO: అనంత ఎస్పీని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఎస్పీతో చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గానీ, అతని అనుచరులకు గానీ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిపై కేసులు పెట్టవద్దని ఎస్పీని కోరారు. వెంకట్రామిరెడ్డి కేవలం తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు.

News May 26, 2024

విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

మరో 8 రోజుల్లో APకి కాబోయే CM ఎవరో తేలిపోనుంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని YCP నాయకులు డేట్, టైం ఫిక్స్ చేశారు. అటు TDP నాయకులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో జూన్ 8,9 తేదీల్లో విశాఖలోని హోటల్ రూములన్నీ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఏపీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు భావిస్తున్నారు.

News May 26, 2024

మాచర్ల: మహిళపై విచక్షణారహితంగా కత్తితో దాడి

image

మాచర్ల పట్టణంలో మహిళపై ఆదివారం ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. 22వ వార్డుకు చెందిన నీలావతి అనే మహిళపై వెంకటేశ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడని బాధితురాలి బంధువులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి వీధుల్లో కత్తితో వీరంగం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

News May 26, 2024

శ్రీకాకుళం: టికెట్ల రూపంలో రూ.9,06,700

image

అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆదివారం ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి టికెట్ల రూపంలో రూ.9,06,700, పూజలు, విరాళాల రూపంలో రూ.83,523, ప్రసాదాల ద్వారా రూ.3,82,840 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

News May 26, 2024

జిల్లా కలెక్టర్ పై మండిపడ్డ మంత్రి కాకాణి

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్‌లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గాని, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేదన్నారు.

News May 26, 2024

విశాఖలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 

image

విశాఖ నగరంలో శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు పలుచోట్ల విస్తృతంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వయంగా పర్యవేక్షించారు. జోన్-1 పరిధిలో ఫోర్ వీలర్స్-17, టూ వీలర్స్-148, ఆటోలు-17, జోన్-2 పరిధిలో టూ వీలర్స్-175, ఆటోలు-10, ఫోర్ వీలర్స్-14, ఒక కమర్షియల్ వాహనంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 26, 2024

కాకినాడ: టీడీపీ నేత మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత గోలి వెంకటరావు ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయనది సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేశారు. వెంకట్రావు కుమారుడు గోలి శ్రీరామ్ గ్రామ ఉపసర్పంచ్‌గా కొనసాగుతున్నారు.