Andhra Pradesh

News May 26, 2024

గుడిపాల: విచక్షణారహితంగా యువతిపై దాడి

image

గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందిన నందిని (18) వ్యవసాయ పొలం వద్దకు వచ్చిందని అకారణంగా ఆమె అన్న కొడుకు విజ్జి విచక్షణ రహితంగా దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. నందినికి తండ్రి లేడని, తల్లికి మతిస్థిమితం లేని కారణంగా గ్రామస్థులే యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన గుడిపాల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News May 26, 2024

నెల్లూరు: ఆంజనేయస్వామి గుడి సమీపంలో వ్యక్తి సూసైడ్

image

వరికుంటపాడు మండల పరిధిలోని విరువూరు శివారు ప్రాంతంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన విరువూరు గ్రామానికి చెందిన తాళ్ల నాగార్జున రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతుడు ఆంజనేయస్వామి మాల ధరించి ఉన్నారు.

News May 26, 2024

‘పిఠాపురంలో వంగా గీతదే విజయం.. మెజారిటీ 6640’

image

పిఠాపురంలో వంగా గీతదే విజయమని, 6640 ఓట్ల మెజారిటీ వస్తుందంటూ అంచనా వేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే..నియోజకవర్గంలో మొత్తం 2,38,000 ఓటర్లు ఉండగా.. 2,04,800 ఓట్లు పోలయ్యాయి. అందులో కులాల వారీగా వర్గీకరిస్తూ వంగా గీతకు 1,05,575 ఓట్లు, పవన్‌కు 98,935 ఓట్లు వస్తాయని లెక్కలేశారు. చివరగా దయచేసి బెట్టింగ్ కాయవద్దని ఓ ట్యాగ్‌లైన్ యాడ్ చేశారు.
– మరి ఈ లెక్కలపై మీ కామెంట్..?

News May 26, 2024

రామతీర్థం జలాశయంలో యువకుడు గల్లంతు

image

చీమకుర్తి మండలం రామతీర్థం జలాశయంలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తాళ్లూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన 9 మంది యువకులు జలాశయాన్ని చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో యాతం మణికంఠ(22) అనే యువకుడు ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

News May 26, 2024

శ్రీకాకుళం కలెక్టర్‌కు అచ్చెన్నాయుడు లేఖ

image

జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనుల నిమిత్తం రైతులకు సాగునీరు, వంశధార కాలువల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టు రైతులకు ఖరీఫ్ కాలానికి సాగునీరు అందించాలని కలెక్టర్‌కు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆదివారం లేఖ రాశారు. జిల్లాలో రూ.2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వంశధార కాలువల వ్యవస్థ దీనస్థితిలో ఉందని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలకు సాగునీరు, వంశధార కాలువల మరమ్మతు చేయాలని కోరారు.

News May 26, 2024

చిత్తూరు: సహకార ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలు చేయాలన్న హైకోర్టు తీర్పుతో జిల్లాలోని 76 సహకార సంఘాల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచింది. దీన్ని సహకార సంస్థలకు వర్తింపజేయలేదు. ఈ మేరకు సహకార ఉద్యోగులకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.

News May 26, 2024

జమ్మలమడుగు: యాచకుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

image

ముద్దనూరు రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇద్దరు యాచకులు మద్యం మత్తులో గొడపడ్డారు. ఈ క్రమంలో ఒకరు బండరాయితో దాడిచేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి ముద్దనూరు సివిల్ పోలీసులు, ఎర్రగుంట్ల రైల్వే సీఐ చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 26, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ రోజు ఏజెంట్లు.. ఇవి మర్చిపోవద్దు

image

ఎలక్షన్-2024 ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి 6 AM లోపు చేరుకోవాలి. ఫాం 18పై ROతో సంతకం చేయించి తీసుకెళ్లాలి. వారు ఇచ్చే ID, ఆధార్, ఫాం 17C తో పాటు ఓట్లు లెక్కించుకునేందుకు బుక్లెట్, పెన్ను తీసుకోవాలి. సెల్‌ఫోన్‌లను అనుమతించరు. ఒకసారి లోపలికి వెళితే బయటికి రానివ్వరు. మీ బ్యాడ్జీపై మీకు కేటాయించిన టేబుల్ వివరాలుంటాయి. అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్లరాదు.

News May 26, 2024

నార్పల: రైతుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

నార్పల మండలం జంగమరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో రైతుల మధ్య ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందారు. అతడు ఇటీవల నూతన బోరు వేయించాడు. మోటార్ ఆమర్చడానికి వెళ్లిన సమయంలో తుంపెర గ్రామస్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కిందపడగా వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News May 26, 2024

శ్రీకాకుళం: ర్యాంకుల వారీగా పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జిల్లాలో రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. మే 27 తేదీన 1 నుంచి 12 వేల లోపు, 28 తేదీన 12,001 నుంచి 27 వేల లోపు, 29 తేదీన 27,001 నుంచి 43 వేలు లోపు, 30 తేదీన 43,001 నుంచి 59 వేల లోపు, 31 తేదీన 59,001 నుంచి 75 వేలు, జూన్‌ 1 తేదీన 75,001 నుంచి 92,000 వరకు, 2 తేదీన 92,001 నుంచి 1,08,000 వరకు, జూన్ 3 తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరుకావాలి.