Andhra Pradesh

News May 26, 2024

కృష్ణా: డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

దూరవిద్యా విధానంలో డిప్లొమా ఇన్ అపారెల్ మర్చండైజింగ్‌ కోర్సులో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్శిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఇగ్నో వర్గాలు సూచించాయి. 

News May 26, 2024

అనంత: సప్లిమెంటరీ పరీక్షలకు 90శాతం విద్యార్థులు గైర్హాజరు..!

image

అనంత జిల్లాలో 10వ తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 90శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షలు విభాగం ఏ.సి. గోవింద నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 సెంటర్లలో హిందీ పరీక్షకు 1680 మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 170 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి తనిఖీ చేశారు.

News May 26, 2024

అనంత:చీనీకాయలు టన్ను రూ.36 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.36 వేలు, కనిష్ఠంగా రూ.15వేలు, సరాసరి రూ.23 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం మార్కెట్‌కు శనివారం మొత్తంగా 525 టన్నుల చీనీకాయలు వచ్చాయని ఆమె వెల్లడించారు.

News May 26, 2024

బేతంచెర్ల: పాత కక్షలతో దాడి.. వ్యక్తి మృతి

image

మండల పరధిలోని రుద్రవరంలో పాత కక్షలతో గొడవ పడి కట్టెలతో శనివారం రాత్రి కొట్టుకున్నారు. ఈ గొడవల్లో హరిప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిప్రసాద్ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 26, 2024

ప.గో: గోదావరి ఒడ్డున వ్యక్తి డెడ్‌బాడీ

image

గోదావరిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చినట్టు నరసాపురం రూరల్ ఎస్ఐ కె.గుర్రయ్య తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురం మండలం రాజులంక ఏటిగట్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడిఉంది. మృతుడి వయసు 40-50 ఏళ్ల మధ్య ఉండవచ్చని, సదరు వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు ఆఫ్ హాండ్స్ బనియన్, నలుపు రంగు చొక్కా ఉందని తెలిపారు.

News May 26, 2024

మైదుకూరు: ‘ఎవరైనా గెలవండి.. మా సమస్య తీర్చండి’

image

మైదుకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య అధికంగా ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచినవారు మొట్టమొదటిగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని శనివారం మున్సిపాలిటీ ప్రజలు ఓ ప్రకటనలో విన్నవించారు. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులలో ఎవరు గెలిచినా నీటి సమస్యపై దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరారు.

News May 26, 2024

కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామానికి చెందిన పిట్టల కామేశ్ ఉపాధి కోసం కత్తిపూడి ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కామేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 26, 2024

నందిగాం:హైవేపై బోల్తా పడిన లగేజీ వ్యాన్

image

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆకుల నందిగాం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం టెక్కలి నుంచి పలాస బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లగేజీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News May 26, 2024

రోళ్ల: మేకల మందపై చిరుత దాడి

image

రొళ్ల మండల పరిధిలోని బంద్రేపల్లి గొల్లహట్టి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున శివన్న మేకల మంద పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేక, రెండు పెంపుడు కుక్కలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మేక మృతితో 8 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News May 26, 2024

28న షార్ నుంచి రాకెట్ ప్రయోగం

image

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని షార్ నుంచి మే 28న అగ్నిబాణ్ సార్టెడ్ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఉదయం 5.45 గంటలకు షార్‌లోని ప్రైవేటు లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించారు. సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌తో ఈ రాకెట్ పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.