Andhra Pradesh

News May 26, 2024

తూ.గో: ముగ్గురికి పరీక్ష.. విధుల్లో 20 మంది

image

‘పది’ సప్లిమెంటరీ హిందీ పరీక్షలో భాగంగా శనివారం తూ.గో జిల్లా కొవ్వూరు పరిధిలో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాలకు 80 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే వచ్చారు. PMMM స్కూల్‌లో 25 మందికి గానూ 1, ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 31 మందికి 1, బాలికోన్నత పాఠశాలలో 24 మందికి ఒకరు పరీక్ష రాశారు. ఈ ముగ్గురి కోసం 20 మంది టీచర్లు విధులు నిర్వహించారు.

News May 26, 2024

కృష్ణా: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు

image

బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్ క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కూలీలు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట వండుతుండగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దేవరాజ్ (2), వనిత (30), సాయినాధ్ (27), లక్ష్మీబాయి (20)లకు తీవ్ర గాయాలవ్వగా.. నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

News May 26, 2024

రేణిగుంట-కడప రహదారిపై వ్యక్తి మృతి

image

రేణిగుంట-కడప జాతీయ రహదారిలోని చెంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రైలు నుంచి జారి పడిపోయాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 26, 2024

నెల్లూరు: డాక్టర్లకు షోకాజ్ నోటీసులు సిద్ధం

image

జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు డాక్టర్లకు షోకాజ్ నోటీసుల జారీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. నెల్లూరులో 20, కావలిలో నాలుగు, కందుకూరులో రెండు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున మొత్తం 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న కారణంతో డిఎంహెచ్వో పెంచలయ్య నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

News May 26, 2024

కర్నూలు: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

పని ప్రదేశంలో ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. హాలహర్వి మండలం ఎంకేపల్లిలో లసమన్న అనే ఉపాధి కూలీ పనికి వెళ్లి పని ప్రదేశంలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు సపర్యలు చేస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏపీఓ హేమ సుందర్ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 వేలు సాయం అందించి వివరాలను జిల్లా అధికారులకు విన్నవించారు.

News May 26, 2024

మార్కాపురం: ‘నా కోరిక తీర్చు.. నీ డిప్యూటేషన్ రద్దు చేయించను’

image

డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఉద్యోగినిపై ఓ అధికారి కీచకుడిగా మారారు. ‘నీ డిప్యూటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలో నా స్నేహితుడికి లాడ్జి ఉంది. లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరకుంటే కంభం వచ్చినా సరే.. రాకుంటే నీ డిప్యుటేషన్ రద్దు చేయిస్తా’ ఇవి ఓ కామాంధ అధికారి మాటలు. ఈ మాటలు విన్న ఆ ఉద్యోగి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

News May 26, 2024

కడప జిల్లాలో క్రాస్ ఓటింగ్ గుబులు

image

కడప జిల్లాలో ఓటింగ్ శాతం పెరగింది. దీంతో పాటు క్రాస్ ఓటింగ్ కూడా పడిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలో షర్మిల ప్రభావం చూపినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చాయి. ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీకి, ఎంపీ ఓటు ఇంకోపార్టీకి వేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఇది ఎవరికి మేలు, ఎవరికి కీడు జరిగిందో తెలుసుకోవాలంటే మరో వారం రోజులు వేచిచూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News May 26, 2024

ప.గో: వెంకన్న దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..!

image

మొగల్తూరు మండలం కాళీపట్నంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో <<13312994>>మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. SI వెంకటరమణ వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శేరిదగ్గుమిల్లికి చెందిన బి.ప్రసాద్ భార్య విష్ణువర్ధిని మరో ఐదుగురు చిన్నారులతో వాడపల్లి వెంకన్న ఆలయానికి ఆటోలో బయలుదేరారు. విజయవాడ నుంచి సిమెంట్‌తో వస్తున్న లారీ పక్కన ఆగి ఉండగా.. వీరి ఆటో వెళ్లి ఢీకొంది. విష్ణువర్ధిని అక్కడికక్కడే మృతి చెందింది.

News May 26, 2024

శ్రీకాకుళం: 112 టేబుళ్లు.. 173 రౌండ్లు

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జూన్ 4న జరగనుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంటు లెక్కింపు ఇక్కడే చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు 8 గదులు సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ స్థానానికి మొత్తం 112 టేబుళ్ల వద్ద 173 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. ప్రతి నియోజకవర్గానికి సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు.

News May 26, 2024

యాడికి: రాళ్లదాడి కేసులో 24 మంది అరెస్ట్

image

యాడికి మండలం కొనుప్పలపాడులో ఇరువర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డ కేసులో 24 మందిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య కర్రలతో ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు పరారీలో ఉండటంతో 24 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరు పరచినట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.