Andhra Pradesh

News May 26, 2024

ప.గో: వెంకన్న దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..!

image

మొగల్తూరు మండలం కాళీపట్నంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో <<13312994>>మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. SI వెంకటరమణ వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శేరిదగ్గుమిల్లికి చెందిన బి.ప్రసాద్ భార్య విష్ణువర్ధిని మరో ఐదుగురు చిన్నారులతో వాడపల్లి వెంకన్న ఆలయానికి ఆటోలో బయలుదేరారు. విజయవాడ నుంచి సిమెంట్‌తో వస్తున్న లారీ పక్కన ఆగి ఉండగా.. వీరి ఆటో వెళ్లి ఢీకొంది. విష్ణువర్ధిని అక్కడికక్కడే మృతి చెందింది.

News May 26, 2024

శ్రీకాకుళం: 112 టేబుళ్లు.. 173 రౌండ్లు

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జూన్ 4న జరగనుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంటు లెక్కింపు ఇక్కడే చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు 8 గదులు సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ స్థానానికి మొత్తం 112 టేబుళ్ల వద్ద 173 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. ప్రతి నియోజకవర్గానికి సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు.

News May 26, 2024

యాడికి: రాళ్లదాడి కేసులో 24 మంది అరెస్ట్

image

యాడికి మండలం కొనుప్పలపాడులో ఇరువర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డ కేసులో 24 మందిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య కర్రలతో ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు పరారీలో ఉండటంతో 24 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరు పరచినట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

News May 26, 2024

రాజమండ్రిలో దంపతుల అనుమానాస్పద మృతి

image

కాకినాడ జిల్లాకు చెందిన దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. జగ్గంపేటకు చెందిన శ్రీధర్(28), ప్రత్తిపాడులోని ఒమ్మంగికి చెందిన దేవి(24)కి 8ఏళ్ల కింద పెళ్లి జరిగింది. వీరికి బాబు(7). మూడేళ్లుగా రాజమండ్రిలో ఉంటున్నారు. గొడవల వల్ల దేవి వారం కింద పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. శ్రీధర్ వెళ్లి శనివారం తిరిగి తీసుకొచ్చాడు. సాయంత్రం బంధువు ఒకరు ఇంటికెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చనిపోయి ఉన్నారు.

News May 26, 2024

పలాస: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు పలాస మీదుగా చెన్నై, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు జూన్ 10 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం చెన్నై- భువనేశ్వర్(నెం.06073), జూన్ 11 నుంచి జూలై 2 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్- చెన్నై(నెం.06074) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News May 26, 2024

VZM: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పూసపాటి రేగ మండలంలో శనివారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతుడు అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన దారపు రెడ్డి అప్పారావు (48)గా గుర్తించారు. ఇతడు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనులు చేస్తుండంగా వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. భోగాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News May 26, 2024

శ్రీకాకుళం: ప్రశాంతంగా డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు శనివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం)లో 100కు 68 మంది, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల)లో 100కు 72 మంది పరీక్ష రాశారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రంలో 330 మందికి 233 మంది హాజరయ్యారు.

News May 26, 2024

గుంటూరు: పాఠశాలకని వెళ్లి తిరిగిరాని విద్యార్థి

image

బడికి వెళ్లిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంపాలెంకు చెందిన బాలుడు పదవ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. సబ్జెక్ట్స్ సప్లిమెంటరీ రాయడానికి సిద్ధమవ్వాలని పాఠశాల మాస్టర్ దగ్గరికి వెళుతున్నానని చెప్పి శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని అండ్రి అన్నారు.

News May 26, 2024

నెల్లూరు జైలుకు గంజాయి విక్రేతల తరలింపు

image

పామర్రులో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఆరుగురికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని SI ప్రవీణ్ కుమార్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను తదుపరి చర్యల నిమిత్తం గుడివాడ కోర్టులో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. కేసు విచారించిన న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించామని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

News May 26, 2024

అనంత: ద్విచక్ర వాహనదారుడిని ఆటోతో ఢీ కొట్టి హత్య

image

అనంతపురం పట్టణంలోని రెండో రోడ్డు ఫ్లైఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి వెంబడించి హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు శనివారం 11 గంటల తర్వాత రహమత్ నగర్‌కు చెందిన సుగాలి జైపాల్ నాయక్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఆటో తో ఢీ కొట్టి ప్రమాదానికి గురి చేశారు. అనంతరం సిమెంటు దిమ్మెను అతడి తలపై వేసి దారుణంగా హత్య చేశారు.