Andhra Pradesh

News May 26, 2024

కేవిబిపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

కేవిబిపురం మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కర్లపూడి గ్రామానికి చెందిన జావిద్ బేగ్(19) ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి బైక్‌పై శ్రీకాళహస్తికి బయలు దేరిన జావిద్.. కర్లపూడి దాటిన తరువాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాయిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ లోకనాథం తెలిపారు.

News May 26, 2024

రాజాం స్వతంత్ర అభ్యర్థిపై కేసు నమోదు

image

సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్ని రాజు, ఆయన ఇద్దరు అనుచరులపై సంతకవిటి పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. ఇద్దరు మైనర్లను బెదిరించి, జైలులో పెడతామని భయపెట్టి చేతులతో కొట్టిన ఘటనలో బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకవిటి ఎస్ఐ షేక్ శంకర్ కేసు నమోదు చేశారు. ఎన్ని రాజుతోపాటు ఆయన అనుచరులు మీసం శ్రవణ్, తూముల యోగేంద్ర పై కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.

News May 26, 2024

ఒంగోలు: టీడీపీ నేత కారు దగ్ధం.. నిందితులు అరెస్ట్

image

సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరిరావుకు చెందిన కారు దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. ఒంగోలులోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితులు కనసాని ఈశ్వర్ రెడ్డి, పాలెటి అభిషేక్, గోపాలుడని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News May 26, 2024

అనంత జిల్లాలో ఓ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకూ శారీరక విభిన్న ప్రతిభావంతులైన బాలబాలికలు వసతి గృహాల్లో ఉండటానికి దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎస్.అబ్దుల్ రసూల్ తెలిపారు. 100 బాలురకు, 50 మంది బాలికలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 26, 2024

అనంత: వేరుశనగ విత్తన కోసం 52,781 మంది రిజిస్ట్రేషన్

image

అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో 52,781 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. విత్తనకాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రకారం 46,588 క్వింటాళ్లు అవసరం అవుతాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి 37,889 క్వింటాళ్ల విత్తనకాయలను ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే విత్తన పంపిణీ సైతం చేస్తున్నామని తెలిపారు.

News May 26, 2024

కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల కమీషన్ మార్గనిర్దేశకాల ప్రకారం సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శనివారం అనంతపురంలోని జేఎన్టీయూలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.

News May 26, 2024

మూడంచెల భద్రతను తనిఖీ చేసిన ఎస్పీ

image

విజయనగరం ఎస్పీ ఎం.దీపిక శనివారం లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల తదనంతరం భద్రపరచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News May 26, 2024

ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూములు ఎస్పీ పరిశీలన

image

ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఎస్పీ జీ.ఆర్.రాధిక శనివారం రాత్రి సందర్శించి, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం గార్డు సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.

News May 26, 2024

కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

image

ఈనెల 4న రాయలసీమ యూనివర్సిటీలో జరుగునున్న ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన, ఎస్పీ కృష్ణకాంత్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో చర్చించారు. కౌంటింగ్ నిర్వహణలో, భద్రతలో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News May 26, 2024

ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూడాలి: జేసీ

image

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకొని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతీఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని అన్నారు