Andhra Pradesh

News May 26, 2024

నెల్లూరు: లెక్కింపు ప్రక్రియకు 130 కెమెరాల సిద్ధం : కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరినారాయణన్ తెలిపారు. అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్ బూతులు, అత్యల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 248 ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో 130 లేదా 140 కెమెరాలను సిద్ధం చేస్తామన్నారు.

News May 26, 2024

విశాఖ: ఈ నెల 27న MEMU రైళ్లు రద్దు

image

నౌపాడ- గుణుపూరు రైలు మార్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నెల 27వ తేదీన విశాఖ నుంచి గుణుపూరు వెళ్లే స్పెషల్ (08522) రైలు, విశాఖ నుంచి పలాస బయలుదేరు MEMU (07470) రైలు, అదే విధంగా గుణుపూరు నుంచి విశాఖ వచ్చు స్పెషల్ (08521) రైలు, పలాస నుంచి విశాఖ వచ్చు MEMU (07471) రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

News May 26, 2024

కడప: ఓట్ల లెక్కింపుకు 1035 మంది సిబ్బంది

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1035 మంది కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో జేసీ గణేష్ కుమార్, జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షకులు ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.

News May 26, 2024

ప.గో: ‘ఎన్నికల ఓట్ల లెక్కింపుకి పకడ్బందీ ఏర్పాట్లు’

image

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సర్‌ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను, భధ్రతా చర్యలను కలెక్టర్ పరిశీలించారు.

News May 26, 2024

డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రశాంతం: ఢిల్లీ రావు

image

ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ పరీక్షకు 1460 మంది అభ్యర్థులకు గాను 888 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షను 08 పరీక్ష కేంద్రాలలో నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష ను ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించామన్నారు.

News May 25, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

విజయవాడ- కాజీపేట సెక్షన్‌లో మూడో లైన్ పనులు జరుగుతున్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లు ఈ నెల 29 వరకు మధిర(TG) స్టేషన్‌లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
.నం.12861 విశాఖపట్నం- మహబూబ్‌నగర్
.నం.17201 గుంటూరు- సికింద్రాబాద్
.నం.12713 విజయవాడ- సికింద్రాబాద్
.నం.12705 గుంటూరు- సికింద్రాబాద్

News May 25, 2024

సీలేరు: 2.286.14 మిలియన్ యూనిట్లు లక్ష్యం

image

సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్ కేంద్రాలకు విద్యుత్ ఉత్పత్తి 2.286.14 మిలియన్ యూనిట్లుగా సెంట్రల్ విద్యుత్ అధారిటీ నిర్దేశించినట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. కాంప్లెక్స్ పరిధిలో పొల్లూరు(లోయర్ సీలేరు) 1084 మిలియన్ యూనిట్లు, డొంకరాయి 95.14 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. అలాగే ఎగువ సీలేరు 477 మిలియన్ యూనిట్లు, మాచ్ ఖండ్ 630 మిలియన్ యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు.

News May 25, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన, భద్రత ఏర్పాట్లను ఎస్పీ దీపిక ఎం.పాటిల్ శనివారం పరిశీలించారు. ఎటువంటి ఆటంకం తలెత్తకుండా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 25, 2024

పూసపాటిరేగ: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు గంగపుత్రుల ఎంపిక

image

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సత్తిరాజు, దిలీప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. చింతపల్లి గ్రామ పెద్దలు ఈ విద్యార్థులను సన్మానించారు. గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటే మత్స్యకార కుటుంబాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతారన్నారు. కార్యక్రమంలో చింతపల్లి గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

News May 25, 2024

వడమాల పేట: చిరుత పులి సంచారం!

image

వడమాల పేట మండలం ఎస్వీపురం అంజీరమ్మ గుడి వెనక అడవిలో చిరుత పులి సంచరిస్తున్నట్లు పుకార్ల నేపథ్యంలో గ్రామస్తులు శనివారం ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు వ్యవసాయ పొలాల వైపు వెళ్లడానికి సైతం భయాందోళనకు గురవుతున్నారు. దీని పట్ల అటవీ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.