Andhra Pradesh

News May 25, 2024

పోలాకి: వంశధార నది రేవు వద్ద వ్యక్తి మృతి

image

పోలాకి మండలం పల్లిపేట గ్రామానికి సమీపంలో గల వంశధార నది రేవు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News May 25, 2024

అనంత: కుక్కపై చిరుత దాడి

image

గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో శనివారం చిరుత పులి కుక్కపై దాడి చేసింది. గ్రామస్థులందరూ కేకలు వేయడంతో గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లింది. జన సంచారంలోకి చిరుత పులి రావడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కొండకు ఇరువైపులా నివాసాలు ఉండటంతో భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

News May 25, 2024

కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదం: ఎస్పీ

image

కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదమని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నింబంధనలు అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ గోపద, జంతుబలులు నిషేద చట్టం 1977 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. దీనికి సంబంధించిన ఏదైన సమాచారం వుంటే జిల్లా నోడల్ ఆఫీసర్ దిశ డీఎస్పీకి అందించాలని కోరారు.

News May 25, 2024

శ్రీకాకుళం: తుఫాను ప్రభావంతో జిల్లాకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్ (రెమాల్)గా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది రేపటికి తీవ్ర తుఫాన్‌గా మరి అవకాశం ఉందని తాజా ప్రకటనలో వెల్లడించారు. ఈ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కావున మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

News May 25, 2024

బెంగళూరు-తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన తవణంపల్లెలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. బంగారుపాళ్యం (M) దండువారిపల్లెకు చెందిన వాసుబాబు, హర్షవర్ధన్ రావు బైక్ పై వెళ్తూ బెంగళూరు-తిరుపతి హైవేపై తెల్లగుండ్లపల్లె వద్ద కిందపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ వాసుబాబు మరణించాడన్నారు. కేసునమోదు చేసినట్టు తెలిపారు.

News May 25, 2024

కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. అనుమతి లేని వాహనాలను, వ్యక్తులను కౌంటింగ్ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News May 25, 2024

కృష్ణా: కౌంటింగ్ మాక్ డ్రిల్ పరిశీలించిన కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బాలాజీ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని తెలియజేశారు.

News May 25, 2024

పుదుచ్చేరి సీఎంతో తూర్పు నౌకదళాధిపతి భేటీ

image

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నటేషన్ రంగస్వామిని తూర్పు నౌకదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ శనివారం కలిశారు. ఈ సమావేశంలో భారత నౌకాదళం సముద్ర కార్యకలాపాలు సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు , తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో అవుట్ రీచ్ కార్యకలాపాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు.

News May 25, 2024

నెల్లూరు: ఆ రెండు రోజులు జాగ్రత్త

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జాన్ 3 నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బల్క్ మెసేజ్లు పంపడం నిషిద్ధమన్నారు. 144 సెక్షన్ కారణంగా విజయోత్సవాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు రెండురోజులు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

News May 25, 2024

28వ తేదీ లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి: కలెక్టర్

image

ఈనెల 28వ తేదీ లోపు కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ నోడల్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ హాలు లోపల, బయట ఇప్పటికే నిర్దేశించిన విధంగా అన్ని ఏర్పాట్లను 28వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.