Andhra Pradesh

News May 25, 2024

బెంగళూరు-తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన తవణంపల్లెలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. బంగారుపాళ్యం (M) దండువారిపల్లెకు చెందిన వాసుబాబు, హర్షవర్ధన్ రావు బైక్ పై వెళ్తూ బెంగళూరు-తిరుపతి హైవేపై తెల్లగుండ్లపల్లె వద్ద కిందపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ వాసుబాబు మరణించాడన్నారు. కేసునమోదు చేసినట్టు తెలిపారు.

News May 25, 2024

కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. అనుమతి లేని వాహనాలను, వ్యక్తులను కౌంటింగ్ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News May 25, 2024

కృష్ణా: కౌంటింగ్ మాక్ డ్రిల్ పరిశీలించిన కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బాలాజీ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని తెలియజేశారు.

News May 25, 2024

పుదుచ్చేరి సీఎంతో తూర్పు నౌకదళాధిపతి భేటీ

image

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నటేషన్ రంగస్వామిని తూర్పు నౌకదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ శనివారం కలిశారు. ఈ సమావేశంలో భారత నౌకాదళం సముద్ర కార్యకలాపాలు సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు , తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో అవుట్ రీచ్ కార్యకలాపాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు.

News May 25, 2024

నెల్లూరు: ఆ రెండు రోజులు జాగ్రత్త

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జాన్ 3 నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బల్క్ మెసేజ్లు పంపడం నిషిద్ధమన్నారు. 144 సెక్షన్ కారణంగా విజయోత్సవాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు రెండురోజులు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

News May 25, 2024

28వ తేదీ లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి: కలెక్టర్

image

ఈనెల 28వ తేదీ లోపు కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ నోడల్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ హాలు లోపల, బయట ఇప్పటికే నిర్దేశించిన విధంగా అన్ని ఏర్పాట్లను 28వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

News May 25, 2024

ప.గో: ‘ఎన్నికల ఓట్ల లెక్కింపుకి పకడ్బందీ ఏర్పాట్లు’

image

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సర్‌ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను, భధ్రతా చర్యలను కలెక్టర్ పరిశీలించారు.

News May 25, 2024

కృష్ణా: డీవైఈఓ స్క్రీనింగ్ టెస్ట్‌కు 1434 మంది హాజరు

image

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 2,370 మంది అభ్యర్థులకు గాను 1434 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 936 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 61% గా నమోదైందన్నారు. 

News May 25, 2024

కృష్ణా: ‘ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం’

image

జూన్ 4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

News May 25, 2024

ఆదోనిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శెట్టి బలిజ హరిప్రసాద్(30)గా గుర్తించామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.