Andhra Pradesh

News May 25, 2024

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలి విద్యార్థిని టాప్ ర్యాంకర్

image

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన పొట్నూరు హారిక జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీఎస్సీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హారిక 9.7 గ్రేడ్ పాయింట్స్ సాధించి జిల్లా టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హారిక జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో కుటుంబ సభ్యులు, పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

News May 25, 2024

శ్రీకాకుళం: సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 3,422 మంది హాజరు కావాల్సి ఉండగా 176 మంది గైర్హాజరై 3,246 మంది పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 926 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది గైర్హాజరై 846 మంది పరీక్ష రాశారని వారు పేర్కొన్నారు.

News May 25, 2024

రాజంపేట: మిద్దెపై నుంచి పడి వ్యక్తి మృతి

image

రాజంపేట ఆకులవీధిలోని నివాసం ఉంటున్న రామాయణం అంజి శుక్రవారం రాత్రి మిద్దె పైనుంచి పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

News May 25, 2024

చిలకలూరిపేట: ఓగేరు వాగులో పడి ఇద్దరు మృతి

image

చిలకలూరిపేట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మద్దిరాల గ్రామంలోని ఓగేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గ్రామానికి చెందిన పరిచూరి శ్రీనివాసరావు(50), వరగాని వెంకట్రావు(40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

నెల్లూరు: 1000 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్

image

1000 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. మూడంచెల భద్రత, కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. కనుపర్తిపాడులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.

News May 25, 2024

కృష్ణా: SSC విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది.
జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

News May 25, 2024

INICETలో ధర్మవరం యువతికి ఆల్ ఇండియా 19వ ర్యాంకు

image

ధర్మవరం పట్టణానికి చెందిన అంబటి నైమిశా INICETలో ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించారు. కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. INICET పరీక్ష రాసి ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించడంతో పలువురు ఆమెను అభినందించారు. నైమిశా మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధించానని పేర్కొన్నారు.

News May 25, 2024

ఏలూరు: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

ఏలూరు జిల్లా స్థానిక ఆశ్రమం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్‌ను బొలెరో వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కార్‌లో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 25, 2024

విశాఖ: అంపైర్లు, స్కోరర్ల వేతనాలు పెంపు

image

అంపైర్లు, స్కోరర్లు, మ్యాచ్ అఫీషియల్స్‌కు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. జిల్లా, జోనల్ స్థాయి అంపైర్లకు రోజుకు రూ.1500 నుంచి రూ.2500, స్కోరర్లకు రూ.800 నుంచి రూ.1500 వేతనం పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా డైలీ అలవెన్సు కూడా పెంచామన్నారు.

News May 25, 2024

చిత్తూరు: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్ వద్ద సింగన్నగారిపల్లె యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కదిరి రైల్వేహెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా తెలిపారు. కురబలకోట మండలం, సింగన్నగారిపల్లెకు చెందిన కన్నెమడుగు గిరిబాబు(37), 5ఏళ్లుగా టీబీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన గిరిబాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.