Andhra Pradesh

News September 24, 2024

ఎన్టీఆర్ జిల్లాలో వరదలు.. బీమా క్లెయిమ్‌లపై కలెక్టర్ ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లాలో వరదలతో ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. ఈ క్రమంలో దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలకు సంబంధించి 49.17శాతం క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన సోమవారం తెలిపారు. మొత్తంగా 11,046 క్లెయిమ్‌లు రిజిస్టర్‌ కాగా.. 5,399 సెటిల్‌ చేసినట్టు చెప్పారు. 2,145 రుణ ఖాతాలకు 164.95 కోట్లు రీ షెడ్యూల్‌ చేసినట్టు కలెక్టర్ తెలిపారు.

News September 24, 2024

విశాఖ: రెవెన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా రెవిన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు జరిగాయి. 40 మంది డిప్యూటీ తహశీల్దారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో అల్లూరి జిల్లాకు ఆరుగురు, అనకాపల్లి జిల్లాకు ఆరుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 28 మంది డీటీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు 14 మంది జూనియర్ అసిస్టెంట్లు, 55 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు.

News September 24, 2024

నేడు విశాఖ రానున్న మంత్రి లోకేశ్

image

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి విశాఖ రానున్నారు. రాత్రి 9.30 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. బుధవారం ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించే సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం రుషికొండ ఐటీ పార్కును సందర్శించి అక్కడ ఉద్యోగులు, నిపుణులతో భేటీ అవుతారు. అదే రోజు రాత్రి తిరిగి బయలుదేరి విజయవాడ వెళతారు.

News September 24, 2024

ఎస్పీ గ్రీవెన్స్‌లో దువ్వాడ వాణీ ఫిర్యాదు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణీ సోమవారం జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో వైవాహిక గోడవల నేపథ్యంలో కోర్టులో కేసు ఉండగా దివ్వెల మాధురి అనే మహిళ తమ చిరునామా గల ఇంట్లోకి తమని రానివ్వకుండా అడ్డుకుంటుందని వాణీ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

News September 24, 2024

బొబ్బిలి చేరుకున్న మరో మెడికో సౌమ్య మృతదేహం

image

మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కొసిరెడ్డి సౌమ్య మృతదేహం బొబ్బిలి పట్టణానికి సోమవారం రాత్రి చేరుకుంది. సౌమ్య మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News September 24, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 243 మంది పంచాయితీ కార్యదర్శుల బదిలీ

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 243 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగగా, బదిలీ అయిన వారు త్వరలో వారికి కేటాయించిన స్థానాలలో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 24, 2024

నగరంపాలెం: పెళ్లికి పిలవలేదన్న స్నేహితుడిపై దాడి

image

పెళ్లికి పిలవలేదని అడిగిన స్నేహితుడిని చితక్కొట్టిన ఘటనపై నగరంపాలెం పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. వికలాంగుల కాలనీకి చెందిన సాయికుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన నాగరాజు స్నేహితుడు. కొద్దిరోజుల క్రితం నాగరాజు వివాహమైంది. తనను పెళ్లికి పిలవలేదని సాయికుమార్ ప్రశ్నించారు. బంధువులందరి ముందు అడుగుతావా అంటూ గొడవ పెట్టుకున్న నాగరాజు కర్రతో కొట్టాడని సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 24, 2024

ఆత్మకూరు: మరణించిన వీఆర్వోకు బదిలీ ఉత్తర్వులు

image

ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నరసింహారెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం జిల్లాలో జరిగిన రెవెన్యూ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అతనికి ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి వీఆర్వో గా పోస్టింగ్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో మృతి ఉన్నతాధికారులకు తెలియకపోవడంతోనే ఇలా జరిగి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.

News September 24, 2024

చిత్తూరు లాడ్జీలో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

image

వ్యభిచారం చేస్తున్న పదిమందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఓ లాడ్జీలో వ్యభిచారం చేస్తున్న ఏడుగురు విటులు, ఇద్దరు మహిళా బాధితులతో పాటు నిర్వాహకురాలు రజియా బేగంను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధిత మహిళలను వారి తల్లిదండ్రులకు అప్పగించి, తిరిగి ఈ వృత్తిలోకి రాకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు.

News September 24, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు రాయవరం విద్యార్థినులు ఎంపిక

image

గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్-17 పుట్‌బాల్ పోటీలకు ఎస్.రాయవరం జడ్పీ పాఠశాలకు చెందిన 5 గురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయిలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో ఎస్.రాయవరం విద్యార్థినులు కావ్య, భార్గవి, వాహిని, వైష్ణవి, వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.