Andhra Pradesh

News May 25, 2024

విశాఖ: అంపైర్లు, స్కోరర్ల వేతనాలు పెంపు

image

అంపైర్లు, స్కోరర్లు, మ్యాచ్ అఫీషియల్స్‌కు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. జిల్లా, జోనల్ స్థాయి అంపైర్లకు రోజుకు రూ.1500 నుంచి రూ.2500, స్కోరర్లకు రూ.800 నుంచి రూ.1500 వేతనం పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా డైలీ అలవెన్సు కూడా పెంచామన్నారు.

News May 25, 2024

చిత్తూరు: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్ వద్ద సింగన్నగారిపల్లె యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కదిరి రైల్వేహెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా తెలిపారు. కురబలకోట మండలం, సింగన్నగారిపల్లెకు చెందిన కన్నెమడుగు గిరిబాబు(37), 5ఏళ్లుగా టీబీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన గిరిబాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 25, 2024

కర్నూలు: రూ.15 లక్షల ధర పలికిన ఎద్దు

image

ఎద్దులంటే సామాన్యంగా రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు ధర పలుతుంటాయి. కానీ ఓ ఎద్దు ఏకంగా రూ.15 లక్షల ధర పలికింది. గోనెగండ్ల మండల పరిధిలోని చిన్ననేలటూరుకు చెందిన గాజుల కుమారస్వామి, రామలింగప్ప, గోవర్దన్, అమరేశ్వరప్ప సోదరులు ఎద్దును విక్రయించగా.. రికార్డు స్థాయిలో రూ.15 లక్షల ధర పలికింది. ఆ ఎద్దును అనంతపురం జిల్లా ఏ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ నజీర్ బాషా కొనుగోలు చేశారు.

News May 25, 2024

శ్రీకాకుళం: SSC విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి.

News May 25, 2024

కడప: ఎన్నికల విధుల్లోకి మరికొంత మంది అధికారులు

image

ఎన్నికలకు అనుబంధంగా విధులు నిర్వహించడానికి కడప, అన్నమయ్య జిల్లాలలో మరికొంత మంది అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రైల్వేస్ డిఎస్పీ బి.మోహన్ రావు, సీఐడి డిఎస్పీ భాస్కర్ రావులను అన్నమయ్య జిల్లాలో నియమించారు. ఏసీపీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఏసీపీ డీఎస్పీ ఎన్ సత్యానందంలను కడప జిల్లాలో నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

News May 25, 2024

14 సంతాన సాఫల్య కేంద్రాలకు అనుమతి: డీఎంహెచ్‌వో

image

కర్నూలు జిల్లాలో 14 సంతాన సాఫల్య కేంద్రాలకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం అదనపు జిల్లా జడ్జి భూపాల్ రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్ రావు, పలువురు ఎన్జీవోలతో కలిసి ఆయన సంతాన సాఫల్య కేంద్రాల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలని తీర్మానిస్తూ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

News May 25, 2024

తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరులో చల్లబడ్డ వాతావరణం

image

నెల్లూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం మబ్బులు కమ్ముకున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.

News May 25, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

image

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19,027 ఓట్లు నమోదు అయ్యాయి. ఒక్కో టేబుల్‌కు 1,058 ఓట్ల చొప్పున 18 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు.

News May 25, 2024

తుగ్గలిలో రైతుకు దొరికిన రూ.20 లక్షల వజ్రం

image

కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వజ్రాల వేట మెుదలైంది. తుగ్గలి మండలం మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు వజ్రం దొరికింది. దీనిని పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.20 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తుగ్గలి మండలంలో వజ్రాల కోసం ఇతర రాష్రాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.

News May 25, 2024

కృష్ణా: టిప్పర్‌ను ఢీకొన్న ఆటో.. మహిళ మృతి

image

ఏలూరు జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌‌ను ఆటో ఢీకొట్టగా.. ఆ ఆటోలో ఉన్న బొర్రా కుమారి(50) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇతర వాహనదారులు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమారి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.