Andhra Pradesh

News May 25, 2024

కృష్ణా: టిప్పర్‌ను ఢీకొన్న ఆటో.. మహిళ మృతి

image

ఏలూరు జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌‌ను ఆటో ఢీకొట్టగా.. ఆ ఆటోలో ఉన్న బొర్రా కుమారి(50) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇతర వాహనదారులు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమారి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

పిల్లలతో భిక్షాటన.. ఈ నంబర్‌కు కాల్‌ చేయండి

image

చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప.గో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి దందా సాగుతోందని, పట్టుబడితే  శిక్షార్హులవుతారని అన్నారు. భీమవరం బస్టాండ్‌లో శుక్రవారం ఓ బాలుడిని గుర్తించి సంరక్షణ నిమిత్తం ఏలూరు వసతి గృహానికి తరలించినట్లు చెప్పారు. ఇలాంటి చిన్నారులు కనిపిస్తే 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని రాజేష్ కోరారు.

News May 25, 2024

ఇచ్ఛాపురం: జాతీయ రహదారిపై కారు బీభత్సం

image

ఇచ్ఛాపురం చీకటి బలరాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం బలరాంపురం గ్రామ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

News May 25, 2024

లార్డ్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలిః కలెక్టర్ నివాస్

image

ఈవీఎం స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు, ఏజెంట్ల వివరాలు లాంగ్ రిజిస్టర్‌లో విధిగా నమోదు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు. ఆయన శనివారం కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత మెగా వ్యవస్థను పరిశీలించారు. అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రెరీలో భద్రపరిచిన పిఠాపురం జగ్గంపేట ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను కూడా పరిశీలించారు.

News May 25, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం

image

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19027 ఓట్లు నమోదు కాగా.. ఒక్కో టేబుల్‌కు 1058 ఓట్ల చొప్పున 18 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు.

News May 25, 2024

కృష్ణా: మత్స్యకారులకు కీలక హెచ్చరికలు

image

తూర్పు మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది సాయంత్రానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాను కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు హెచ్చరించారు. మే 26వ తేదీ రాత్రికి ఈ తుఫాన్ బంగ్లాదేశ్& పశ్చిమ బెంగాల్‌ మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని APSDMA స్పష్టం చేసింది.

News May 25, 2024

కడప: YVUకి బంగారు పతకం

image

యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని బద్వేల్ నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు చెందిన మురళీ కృష్ణ ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీవరకు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి వైవీయూకు బంగారు పతకం అందించారు. శనివారం ఉదయం మురళి కృష్ణను యూనివర్సిటీకి పిలిపించి వీసీ చింత సుధాకర్, అధ్యాపకులు సత్కరించారు.

News May 25, 2024

అలిపిరి శ్రీవారి మెట్ల వద్ద బాలుడి మిస్సింగ్

image

పచ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ కుటుంబం శనివారం శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. అలిపిరి కాలిబాట మొదలయ్యేటప్పుడు ఆ కుటుంబానికి చెందిన 6 సంవత్సరాల బాలుడు మిస్సైయాడు. దీంతో టీటీడీ విజిలెన్స్ & పోలీసు అధికారులని సంప్రదించగా వారు ముమ్మరంగా గాలిస్తున్నారు.

News May 25, 2024

వినుకొండ: గుండెపోటుతో వీఆర్వో మృతి

image

గుండె పోటుకు గురై VRO మృతి చెందిన ఘటన వినుకొండ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న యేసు రత్నం, స్వగ్రామమైన పానకాలపాలెంలో శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. యేసు రత్నంకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News May 25, 2024

తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

image

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరగడంతో దేవస్థానం అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం దైవ దర్శనానికి 20 గంటల సమయం పట్టడం గమనించదగ్గ అంశం. ఒకవైపు ఎన్నికలు ముగియడం మరోవైపు వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నెల చివరి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.