Andhra Pradesh

News May 25, 2024

గుంటూరు: పొలాల్లో యువతి మృతదేహం కలకలం

image

గుంటూరు సమీపంలోని పొలాల్లో ఒక యువతి దేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద పొలాల్లో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె నోటి వెంట నురగతో పాటు రక్తం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 25, 2024

ప.గో జిల్లాలో 187.8 మిల్లీమీటర్ల వర్షపాతం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో 187.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఆచంట మండలంలో 40 మిల్లీమీటర్లు, ఇరగవరం మండలంలో 35.6, పాలకొల్లు మండలంలో 29.2, పోడూరు మండలంలో 20.2, పెనుగొండ మండలంలో 19.2, నరసాపురం మండలంలో 17.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

News May 25, 2024

అస్వస్థతకు గురై తుని రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు జీఆర్పీ SI అబ్దుల్ మారుఫ్ తెలిపారు. విశాఖలోని కృష్ణ మార్కెట్ ప్రాంతంలో బంగారం పనిచేసే మధుపాక భాస్కర్‌రావు(45)గా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖ నుంచి బ్రహ్మంగారి మఠానికి ట్రైన్‌లో వెళ్తుండగా.. తుని రైల్వే స్టేషన్‌లో దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ఎస్సై తెలిపారు.

News May 25, 2024

మదనపల్లె: శేషాద్రి హత్యకు ఆధిపత్య గొడవలే కారణమా..?

image

మదనపల్లెలో శనివారం వేకువ జామున రామారావుకాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే ఓ ముఠా ఈ ఘాతుకానిక పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆధిపత్య పోరులో భగంగా ముఠాలోని సుమారు 30 మంది ప్రత్యర్థులు శేషాద్రిని కత్తులు, వేట కొడవళ్లతో 70సార్లు అతికిరాతకంగా నరికి హతమార్చారు. పోలీసులు కత్తిపోట్లు చూసి విస్తుపోయారు.

News May 25, 2024

ప.గో: ALERT.. చలామణిలో భారీగా నకిలీ నోట్లు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీల తరఫున ఓటర్లకు తాయిలాలు అందాయి. నేతలు పంపిణీ చేసిన నగదులో రూ.500, రూ.200 నోట్లు ఎక్కువగా ఉండగా, అందులో చాలావరకు నకిలీవి ఉన్నట్లు సమాచారం. కొనుగోళ్ల ద్వారా ఇవి మార్కెట్‌లోకి వస్తుండటంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గెలుపోటములపై జరుగుతున్న బెట్టింగ్స్‌లోనూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

News May 25, 2024

నంద్యాల: నెల రోజులపాటు ఈ రెండు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల మరమ్మతుల పనుల కారణంగా రైళ్ల రద్దు మరికొంత కాలం పొడిగిస్తూ రైల్వే ఉన్నాతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని డోన్ రైల్వేస్టేషన్ మేనేజర్ జి.వేంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు నుంచి డోన్(17228) రైలు, హుబ్బళ్లి నుంచి విజయవాడు(17329) జూన్ 30వ తేదీవరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే వారికి సహకరించాలని కోరారు.

News May 25, 2024

కూర్మన్నపాలెం వద్ద బీభత్సం సృష్టించిన కారు

image

కూర్మన్నపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఓ మైనర్ కారు తీసి నడపడం వల్ల ఈ విధంగా జరిగిందని స్థానికులు తెలిపారు. పలు బైక్‌లను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టింది. ఏం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఓపక్క ప్రచారం చేస్తున్నా పట్టించుకోవట్లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

ఉదయగిరిలో విషాదం.. చెరువులో పడి మహిళ మృతి

image

ఉదయగిరిలోని శివారు ప్రాంతం కొత్త చెరువులో ప్రమాదపుశాత్తు కాలుజారి పడి ఉపాధి కూలి పెరుమాళ్ల వెంకటలక్ష్మి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పనులకు వెళ్లేందుకు చెరువు దగ్గర దాచి ఉంచిన పనిముట్లను తీసుకునేందుకు ముగ్గురు మహిళలు వెళ్లారు. పనిముట్లు తీసే క్రమంలో వెంకటలక్ష్మి కాలుజారి చెరువులో పడిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెను ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయారు.

News May 25, 2024

జమ్మలమడుగు: మిద్దెపైన నిద్రిస్తుండగా.. ఇంట్లో దోచేశారు

image

జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడులో గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో దొంగతనం జరిగింది. బాదితులు పెద్ద ఓబులేసు, భార్య గురుదేవి మాట్లాడుతూ.. రాత్రి ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో బీరువా తీసి 13 తులాల బంగారు, రూ.50 వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. అలాగే పక్క ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని తెలిపారు. జమ్మలమడుగు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 25, 2024

శ్రీకాకుళం: ఏజెంట్ల ఎంపికపై పార్టీలు అప్రమత్తం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇరు పార్టీలకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించే దిశగా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర ఏజెంట్లకు దీటుగా వారిని తట్టుకునే శక్తియుక్తులున్న వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వసనీయుల పేర్లనే రిటర్నింగ్ అధికారులకు పంపించేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.