Andhra Pradesh

News May 25, 2024

విశాఖ: తొలి ఫలితం 3.15 గంటలకు వచ్చే అవకాశం!

image

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఉదయం 8 గం. ఓట్ల లెక్కింపు మొదలౌతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ 3 రౌండ్లలో పూర్తి చేస్తారు. అనంతరం EVMల లెక్కింపు ప్రారంభం అవుతుంది. తొలి ఫలితం విశాఖ వెస్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 16 రౌండ్లలో కౌంటింగ్ చేయగా మ. 3:15కి తొలి ఫలితం వస్తుంది. తుది ఫలితం భీమిలిలో 26 రౌండ్లు పూర్తి కాగా రాత్రి 7.30కి వచ్చే అవకాశం ఉంది.

News May 25, 2024

పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం

image

పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య(73) పురుగు మందు తాగాడు. పరిహారం, R&R ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News May 25, 2024

పూతలపట్టు: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

పూతలపట్టు మండలం మూర్తిగారి ఊరు దుర్గం గుట్టపైన చెట్టుకు ఉరి చేసుకొని వడివేలు (60) అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం మేకలు మేపేవారు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. నెల రోజుల క్రితం మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

VZM: విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తండ్రి మందలించడంతో కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం సింగిరెడ్డివలసకు చెందిన విద్యార్థిని (17) విశాఖలోని మహారాణిపేట బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్ ఫెయిల్ అయిన విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం మహారాణిపేట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News May 25, 2024

23 రౌండ్లలో మండపేట ఓట్ల లెక్కింపు.. ఫలితం ఆలస్యం!

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓట్లు లెక్కింపుపై సర్వత్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి గెలుస్తారు..? ఫలితాలు ఏ పార్టీ వైపు ఉంటాయి..? అనే చర్చ నడుస్తుంది. అయితే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. మండపేట ఓట్లను 23 రౌండ్లలో లెక్కిస్తారు. దీంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

News May 25, 2024

ప్రకాశం: భార్యను హతమార్చి తప్పించుకునేందుకు ప్లాన్.. అక్కడే ట్విస్ట్

image

భార్యను హత్య చేసి, ఆపై తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడో కసాయి భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. కొనకమిట్ల మండలానికి చెందిన మధులత, దర్శికి చెందిన పరకాల నాగేంద్ర దంపతులు. ఈనెల 4న రాత్రి వారి మధ్య గొడవ కాగా.. నాగేంద్ర ఆవేశంలో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలు చేయాలనుకొని, ఆపై గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాల పాలయ్యాడు.

News May 25, 2024

ఆత్మకూరులో యువకుడి మృతి

image

ఆత్మకూరులో శుక్రవారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హుస్సేన్ (25) స్థానిక పెద్ద మసీదు ప్రాంతంలోని ఓ ఇంటికి అద్దాలు బిగించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తూ.. ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుస్సేన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చినట్లు ఎస్ఐ ముత్యాల రావ్ తెలిపారు.

News May 25, 2024

కైకలూరులో చెక్కు చెదరని కనుమూరి బాపి రాజు రికార్డు

image

మీసాల రాజుగా పేరొందిన కనుమూరి బాపి రాజుకు కైకలూరు ఎన్నికలలో అరుదైన రికార్డ్ ఉంది. కైకలూరు ఎమ్మెల్యేగా వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఎన్నికై ఆయన అరుదైన రికార్డ్ సృష్టించారు. 1978, 83, 85, 89 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. టీడీపీ ప్రభంజనాన్ని సైతం ఎదురొడ్డి 1983, 85లో బాపిరాజు కైకలూరులో విజేతగా నిలవడం విశేషం.

News May 25, 2024

తూ.గో జిల్లాకు జూన్ 7లోగా రుతుపవనాల ఎంట్రీ

image

వచ్చేనెల మొదటివారంలోనే ఉమ్మడి తూ.గో జిల్లాకు రుతుపవనాలు రానున్నాయి. ఈనెల 29 నుంచి 30 లోగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి నాలుగు లేదా ఐదవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరానికి చేరుతాయి. అప్పట్నుంచి భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ సారి 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

News May 25, 2024

కృష్ణా: అడ్మిషన్లకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన సీట్లను అర్హులైన విద్యార్థులతో భర్తీ చేస్తామని పాఠశాలల DCO సుమిత్రాదేవి తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాసి 5వ తరగతిలో సీటు పొందలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అడ్మిషన్ కావాల్సిన విద్యార్థులు సంబంధిత పాఠశాలలలో సంప్రదించాలని కోరుతూ సుమిత్రాదేవి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.