Andhra Pradesh

News May 25, 2024

పచ్చటి పల్నాడు పల్లెల్లో రాజకీయ కార్చిచ్చు

image

పాడి పంటలతో కళకళలాడే పచ్చటి పల్నాడు జిల్లాలో రాజకీయ కార్చిచ్చుకు ఆహుతై పోతున్నాయి. కులమతాలకు అతీతంగా ఉండే ఆత్మీయులే ఎన్నికల సమయానికి బద్ధ శత్రువులుగా మారుతున్నారు. క్షణికావేశంలో జరిగే దాడులతో పురుషులు జైళ్ళపాలు అవుతుంటే.. మహిళలు వ్యవసాయ కూలీలవుతున్నారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు. 

News May 25, 2024

విజయవాడ: బాడీ మసాజ్ కేంద్రంపై పోలీసులు దాడి

image

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో బాడీ స్పా నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ గుణరామ్ తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధార్థ నగర్‌లో బ్యూటీ పార్లర్ పేరుతో బాడీ మసాజ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ దాడిలో ముగ్గురు యువతులను, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 25, 2024

నెల్లూరు: కన్నల పండుగగా పెంచలకోన తెప్పోత్సవం

image

ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని తెప్పపై ఉంచి కోనేటిలో ఊరేగించారు. నేత్రపర్వంగా సాగిన ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనులు కోలాహలంతో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో కోన మారుమోగింది.

News May 25, 2024

తిరుపతి: 27న క్యాంపస్ డ్రైవ్

image

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 27న క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ ప్రకటించారు. ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 25, 2024

26న కడపలో అండర్ 16 పురుషుల క్రికెట్ ఎంపికలు

image

మే 26 ఉదయం 7 గంటలకు కడపలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో U-16 పురుషుల క్రికెట్ ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్, కిట్ బ్యాగు తప్పక తీసుకురావాలని తెలిపారు. 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు31 మధ్య జన్మించి ఉండాలి.

News May 25, 2024

పారదర్శకంగా 813 మంది కౌంటింగ్ పర్సనల్స్ నియామకం: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కౌంటింగ్ పర్సనల్స్ 1వ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కౌంటింగ్ కోసం 813 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.

News May 25, 2024

కౌంటింగ్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

image

సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై అనంతపురం జిల్లా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ గౌతమి శాలి కలిసి జిల్లాలోని అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

News May 25, 2024

కోనసీమ: కూటమి అధికారంలోకి వస్తుంది: ఆకుల

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తీర్మానించామన్నారు. అందుకు అనుగుణంగానే జేఏసీ నాయకులు కృషి చేసినట్లు వివరించారు.

News May 25, 2024

విజయనగరం: సరిగ్గా 10 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 10 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మన విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
– మీ కామెంట్..?

News May 25, 2024

5 రోజుల పాటు చేబ్రోలు రైల్వేగేటు మూసివేత

image

చేబ్రోలు రైల్వే గేటును ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కారణంగా తాత్కాలికంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాబట్టి దూబచర్ల, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.