Andhra Pradesh

News May 25, 2024

కోనసీమ: కూటమి అధికారంలోకి వస్తుంది: ఆకుల

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తీర్మానించామన్నారు. అందుకు అనుగుణంగానే జేఏసీ నాయకులు కృషి చేసినట్లు వివరించారు.

News May 25, 2024

విజయనగరం: సరిగ్గా 10 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 10 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మన విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
– మీ కామెంట్..?

News May 25, 2024

5 రోజుల పాటు చేబ్రోలు రైల్వేగేటు మూసివేత

image

చేబ్రోలు రైల్వే గేటును ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కారణంగా తాత్కాలికంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాబట్టి దూబచర్ల, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News May 25, 2024

విశాఖలో నేడు డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విశాఖ జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతుందని, మొత్తం 4,498 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీ.ఆర్.ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు.

News May 25, 2024

అవగాహన ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించాలి: గుంటూరు కలెక్టర్

image

పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌పై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ హాల్‌లో సంబంధిత టేబుల్ వరకు అనుమతిస్తామని చెప్పారు. సెల్‌ఫోన్లు అనుమతించరని, పేపర్, పెన్ను తీసుకొని వెళ్ళవచ్చన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపుపై పార్లమెంట్ అభ్యర్థులతో శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో సమీక్ష నిర్వహించారు.

News May 25, 2024

ఓట్ల లెక్కింపుకు అధికారులంతా సంసిద్ధం కావాలి: డీకే బాలాజీ

image

జూన్ 4న కృష్ణా వర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులంతా పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఓట్ల లెక్కింపుపై ఆర్వోలు, ఏఆర్వోలకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. 

News May 25, 2024

శ్రీకాకుళం: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆమదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*పలాసలో 40 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు.*వజ్రపుకొత్తూరు మండల పరిధిలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య. *దైవ దర్శనానికెళ్లి కాశీలో గుండె పోటుతో మృతి చెందిన టెక్కలివాసి. *రాష్ట్రంలో పోలైన అత్యధిక బ్యాలెట్ ఓట్లు శ్రీకాకుళం జిల్లాలోనే. *మద్యం మత్తులో డ్రైనేజీలో పడి మృతి చెందిన హిరమండల వాసి. *ఎచ్చెర్ల మండల పరిధిలో బోల్తాపడిన ఇసుక లారీ.*రైల్వే పనుల కారణంగా పాతపట్నం వెళ్లే రైళ్లు రద్దు

News May 24, 2024

కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ తో కలిసి పరిశీలించారు.

News May 24, 2024

కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చెయ్యండి: కలెక్టర్

image

కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూములో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల లైవ్ ఫీడ్‌ను పరిశీలించారు. అనంతరం ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.