Andhra Pradesh

News May 24, 2024

శ్రీకాకుళం: ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆముదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 24, 2024

కృష్ణా జిల్లాకు రేపు వర్ష సూచన

image

కృష్ణా జిల్లా పరిధిలో శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని APSDMA స్పష్టం చేసింది.

News May 24, 2024

కౌంటింగ్‌కు రాజకీయ పార్టీల శ్రేణులు సహకరించాలి: ఢిల్లీరావు

image

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల శ్రేణులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్లో నేడు ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను క్షుణ్నంగా వివరించినట్లు కలెక్టర్ తెలిపారు.

News May 24, 2024

నెల్లూరు : మే25న ఏపీపీఎస్సీ పరీక్ష

image

జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్డీ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్డీ సమావేశం నిర్వహించారు. పరీక్షను పక్కాగా నిర్వహించాలన్నారు.

News May 24, 2024

డీఈఓ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి: జేసీ

image

ఈ నెల 25వ తేదీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాలలో మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 605 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి 8.15 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

News May 24, 2024

VZM: 6 కేంద్రాలు.. 1470 మంది అభ్యర్థులు

image

VZM జిల్లాలో డిప్యూటీ DEO పరీక్షను 6కేంద్రాల్లో అధికారులు శనివారం నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు 1470 మంది హాజరుకానున్నారు. రాజాం GMR కళాశాలలో 300 మంది, చింతలవలసలోని MVGR- 250, భోగాపురంలోని అవంతి- 170, బొబ్బిలిలోని స్వామి వివేకానంద- 90, విజయనగరంలోని సత్య- 150, కొండకరకాం సీతం కాలేజీలో 510 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11:30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 24, 2024

నంద్యాల: మిట్టకందాలలో పిడుగు

image

పాములపాడు మండలం మిట్ట కందాలలో శుక్రవారం పిడుగు పడింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. పడిగుపడటంతో గడ్డివాముకు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గాలి ఎక్కువగా వీస్తుండటంతో మంటలు భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

News May 24, 2024

లోకేశ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్.. మీ COMMENT.!

image

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.

News May 24, 2024

లోకేశ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్.. మీ COMMENT.!

image

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.

News May 24, 2024

రేపు ఒంటిమిట్టలో తిరుమల లడ్డు విక్రయం

image

రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని సన్నిధిలో నాలుగో శనివారం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండనుంది. టిటిడి ఆధ్వర్యంలో ఒక లడ్డు రూ.50 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.