Andhra Pradesh

News May 24, 2024

VZM: 25న పరీక్ష.. 8:30 లోపు చేరుకోవాలి

image

APPSC డిప్యూటీ డీఈవో నియామక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 లోపు చేరుకోవాలని DRO అనిత తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె శుక్రవారం సమీక్షించి పలు సూచనలు చేశారు.

News May 24, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్‌లకు అనుమతి లేదు: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అధికారులకు వివరించారు.

News May 24, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్..పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 24, 2024

కౌంటింగ్ విధులను అప్రమత్తంగా నిర్వహించాలి: నెల్లూరు కలెక్టర్

image

ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

News May 24, 2024

వజ్రపుకొత్తూరులో ఉరివేసుకొని యవకుడి ఆత్మహత్య

image

మండలంలోని బెండిగేట్ సమీప తోటలోని చెట్టుకు ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి భయాందోళన చెందుతూ.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని జేబులోని ఐడి కార్డు ఆధారంగా విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు(26)గా గుర్తించారు.

News May 24, 2024

కొమరవోలులో పిడుగు పడి మహిళా రైతు మృతి

image

రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన గణేశ్వరి(39) పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తనకు ఉన్న పశువులను మేతకు తీసుకువెళ్ళింది. వాటిని మేపుకుంటూ పొలం వద్ద ఉండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో గణేశ్వరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త తమ్మునాయుడుతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

News May 24, 2024

అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి

image

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మరుట్ల గ్రామంలో భాను శ్రీ అనే బాలిక గురువారం రాత్రి ఇంట్లో విద్యుత్ షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 24, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ నిర్వహణకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

image

జూన్ 4వ తేదిన చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో జరగనున్న సార్వత్రిక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఓట్ల కౌంటింగ్ నిర్వహణ, కౌంటింగ్ రోజున తీసుకోవలసిన చర్యలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమీక్షించారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు.

News May 24, 2024

కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

image

విశాఖ ఆంధ్రా యూనివ‌ర్సిటీ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నిక‌ల అధికారి క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున శుక్రవారం మ‌ధ్యాహ్నం ప‌రిశీలించారు. పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎ. ర‌విశంక‌ర్‌తో క‌లిసి పార్లమెంట్, అసెంబ్లీ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల‌ను త‌నిఖీ చేసిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. భ‌ద్ర‌తాప‌ర‌మైన ఏర్పాట్లను ప‌రిశీలించారు.

News May 24, 2024

రాయచోటి: పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 25 నుంచి జూన్ 2 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. మే 27 నుంచి జూన్ 3 వరకు సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాలు పరిశీలిస్తారన్నారు. మే 31 నుంచి జూన్ 5 వరకు కేంద్రాల ఎంపిక, మార్పులు జరుగుతాయన్నారు.