Andhra Pradesh

News May 24, 2024

రాయచోటి: పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 25 నుంచి జూన్ 2 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. మే 27 నుంచి జూన్ 3 వరకు సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాలు పరిశీలిస్తారన్నారు. మే 31 నుంచి జూన్ 5 వరకు కేంద్రాల ఎంపిక, మార్పులు జరుగుతాయన్నారు.

News May 24, 2024

విజయనగరం: తొలిరోజు పరీక్ష.. 729 మంది గైర్హాజరు: DEO

image

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు జిల్లా మొత్తంగా 1218 విద్యార్థులకు గాను 489 మంది హాజరయ్యారు. 729 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. 

News May 24, 2024

విజయనగరం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: SP

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారని SP దీపిక తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న 38 మందిపై, ఓపెన్ డ్రింకింగ్ చేసిన మరో 74మందిపై కేసులునమోదుచేశారని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దన్నారు.

News May 24, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

విజయనగరం: తొమ్మిదేళ్ల బాలుడు మృతి

image

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్ళపెంటకు చెందిన తామాడ అఖిల్ (9) గురువారం రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు మండల SI మహేశ్ కుమార్ తెలిపారు.

News May 24, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

కొడవలూరులో అగ్ని ప్రమాదం

image

కొడవలూరు మండలం గండవరం గౌతమ్ నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామంలోని ఓ రైతుకు చెందిన గడ్డివాము కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 24, 2024

మార్కాపురం: విద్యుత్ షాక్‌తో ఏడు పాడి గేదెలు మృతి

image

విద్యుదాఘాతంతో 7 పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పలువురి రైతులకు చెందిన 7 పాడి గేదెలు శుక్రవారం గ్రామ శివారులో మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గేదెల విలువ రూ.5లక్షలు ఉంటుందని రైతులు వాపోయారు.

News May 24, 2024

జయ బాడిగకు అభినందనలు తెలిపిన చంద్రబాబు

image

కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ ఇటివల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు X వేదికగా అభినందనలు తెలిపారు. జయ బాడిగ విజయవాడకు చెందిన వారు కావడం గర్వకారణమని అన్నారు. ఆమె పదవి కాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు.

News May 24, 2024

చంద్రగిరిలో వ్యక్తి హత్య

image

చంద్రగిరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. పనపాకం గ్రామం వద్ద గుర్తు తెలియని ఓ వృద్దుడు హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు నిర్థారించారు. ఎవరో తలపై దాడి చేసి హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.