Andhra Pradesh

News May 24, 2024

ప.గో.: బ్యాంకులో మహిళకు గుండెపోటు.. కుప్పకూలి మృతి

image

తణుకు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం నగదు లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వచ్చారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మ (55) గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలి మృతి చెందారు.

News May 24, 2024

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీ ఏర్పాట్లు: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తికావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ కె.కార్తీక్ పాల్గొన్నారు.

News May 24, 2024

శ్రీకాకుళం: రేపే పరీక్ష.. 830 మందికి 4 కేంద్రాలు

image

APPSC ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు శుక్రవారం పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 830 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా కేంద్రాల‌ వ‌ద్ద 144 సెక్ష‌న్ అమ‌లు చేయాల‌ని పోలీసులకు సూచించారు.

News May 24, 2024

కోడూరు: బైకు, లారీ ఢీ.. ఒకరు మృతి

image

రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలోని అప్పరాజుపేట వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెనగలూరు మండలం కొండూరుకు చెందిన పసుపులేటి సుబ్బ నరసయ్య మృతి చెందగా, తోట వెంకటరమణ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 24, 2024

విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కృష్ణా నది వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వన్ టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణానది వద్ద స్థానికులు గుర్తుతెలియని మృతదేహం ఉందన్న ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా 50 సంవత్సరాల వ్యక్తి గల మృతదేహం లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News May 24, 2024

కౌంటింగ్‌పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

కౌంటింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన, పట్టు కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అంబేడ్కర్ ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్‌వైజర్‌లు, మైక్రో అబ్జర్వర్‌లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

News May 24, 2024

పలాసలో 40 తులాల బంగారం చోరీ

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీనగర్‌లో తెల్లవారుజామున ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. NREGSలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ తన స్వగ్రామానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించి దోచేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.18 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 24, 2024

పార్వతీపురంలో అక్రమంగా పట్టుబడిన మద్యం ధ్వంసం

image

పార్వతీపురంలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా, మద్యం సీసాలను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సునీల్ షరైన్, సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 576 మద్యం బాటిల్స్‌తో పాటు, సుమారు 130 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.

News May 24, 2024

భీమవరం: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్

image

భీమవరంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదే కాలేజ్ భవనం పైనుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతడి ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. రోజులాగే బుధవారం కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. హఠాత్తుగా భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News May 24, 2024

మాచర్ల: విద్యుత్ షాక్‌‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మాచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన ముక్కాల శ్రీను (58) పొలంలో ట్రాక్టర్‌తో మందు పిచికారి చేయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శ్రీనుకు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.