Andhra Pradesh

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ సీట్ల వివరాలు

image

శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ , 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో 780 సీట్లు, ప్రైవేట్ కళాశాలలో 1811 సీట్లు మొత్తం 10 కళాశాలలో 2,591 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 300 సీట్లు, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌-120 సీట్లు, ఆమదాలవలస-120 సీట్లు, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, ఉన్నాయి.

News May 24, 2024

ఢిల్లీ ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి

image

పుంగనూరుకు చెందిన పగడాల రవి, భవాని దంపతుల కుమారుడు పగడాల హర్షల్ మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని తల్లిదండ్రులు మానవత్వంతో అవయవాల దానానికి అంగీకరించారు. ఎంబీఏ పూర్తి చేసుకున్న మృతుడు.. రెండు రోజుల్లో స్వస్థలానికి రావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు.

News May 24, 2024

విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన కానిస్టేబుల్ వీఆర్‌కు

image

లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న చెన్నకేశవ అనే కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీచేసినట్లు డీఎస్పీ కంజక్షన్ తెలిపారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ప్రొటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు అందాయని వాటిని దృష్టిలో పెట్టుకుని వీఆర్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ సీట్ల వివరాలు

image

శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ , 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో 780 సీట్లు, ప్రైవేట్ కళాశాలలో 1811 సీట్లు మొత్తం 10 కళాశాలలో 2,591 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 300 సీట్లు, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌-120 సీట్లు, ఆమదాలవలస-120 సీట్లు, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, ఉన్నాయి.

News May 24, 2024

ప్రకాశం: ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ.. తమ్ముడు మృతి

image

ఆస్తి కోసం అన్నదమ్ములు ఘర్షణలో తమ్ముడు మృతి చెందిన ఘటన శింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అన్నదమ్ముల మధ్య మాట మాట పెరిగి పరస్పర దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తమ్ముడు చొప్పర శివశంకర్‌(33) మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News May 24, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల వేసవి రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం దర్శనానికి 20 గంటలు పట్టవచ్చని టీటీడీ అధికారుల అంచనా వేస్తున్నారు. గురువారం శ్రీవారిని 65,416 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.51 కోట్లు వచ్చాయి. స్వామివారికి 36,128 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం కోసం శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

News May 24, 2024

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీలో కాకాణి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు గుర్తించిన విషయం తెలిసిందే.. అయితే కాకాణిపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. ‘నీవి,నావి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ కి ఇద్దాం..అప్పుడు తెలుస్తుంది ఎవరు డ్రగ్స్ తీసుకుంటారో’ అని కాకాణి కౌంటర్ వేశారు.

News May 24, 2024

అనంత జిల్లాలో నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీ

image

అనంతపురం జిల్లాలో నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమామహేశ్వరమ్మ, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. మొత్తం 353 రైతుభరోసా కేంద్రాల్లో 31 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ నిల్వ చేశామన్నారు. జిల్లాలో గత ఐదు రోజులుగా 40,704మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. గరిష్ఠంగా ఒక్కో రైతుకు మూడు బస్తాలు (90 కిలోలు) ఇస్తామన్నారు.

News May 24, 2024

KNL: డ్రగ్ కంట్రోల్ ఏడీపై సస్పెన్షన్ వేటు

image

ఎన్నికల విధులకు హాజరుకాని అధికారులు, ఉద్యోగులపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) రమాదేవిని సస్పెండ్ చేశారు. జిల్లా అధికారిణిగా ఉంటూ ఎన్నికల విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేయాలని ఆ శాఖ డీజీ రఘురామిరెడ్డికి సిఫార్సు చేశారు. దీంతో ఆమెపై సస్పెన్షన్‌ వేటు పడింది.

News May 24, 2024

సింహాచలం: నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.