Andhra Pradesh

News May 24, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 28కి వాయిదా

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25లో ప్రథమ ఇంటర్‌లో, ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24, 25వ తేదీల్లో అడవి తక్కెళ్లపాడు అంబేడ్కర్ బాలుర గురుకులంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయకర్త కె. పద్మజ తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం బాలురు ఈనెల 28, బాలికలు 29న ఉదయం 10 గంటలకు గురుకులంలో హాజరు కావాలని తెలిపారు.

News May 24, 2024

కోనసీమ: కాలువలోకి దూసుకెళ్లిన చేపల వ్యాన్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని బొబ్బర్లంక-పల్లంకుర్రు పంట కాలువలోకి శుక్రవారం ఉదయం ఓ డీసీఎం దూసుకెళ్లింది. చెరువులో పట్టిన చేపలు తరలించేందుకు వచ్చిన డీసీఎం వ్యాన్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు వ్యాన్‌పై మరొక యువకుడు ఉన్నట్టు సమాచారం. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

News May 24, 2024

నెల్లూరు: హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

image

బాపట్లలో ఈ నెల 15న జరిగిన ప్రశాంత్ హత్యకేసులో నెల్లూరుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ప్రశాంత్ బాపట్ల పాత బస్టాండ్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డితో పాటు ఆర్.లక్ష్మయ్య, ద్వారకా, చెర్ల లక్ష్మణ్, పంగా రోహిత్, కొమరిక ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

News May 24, 2024

అనంత: టపాసుల క్రయ విక్రయాలపై నిషేధం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టపాసులు క్రయవిక్రయాలపై నిషేధం విధించమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే టపాసుల అమ్మకాలు నిషేధించామన్నారు జూన్ 6వ తేదీ వరకు ఎక్కడ టపాసుల అమ్మకాలు జరగకూడదని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రవాణా, అమ్మకాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News May 24, 2024

కృష్ణా: తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్ (NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 06105 NCJ- DBRG రైలును జూన్ 14,21,28 తేదీలలో, నం.06106 DBRG- NCJ రైలును జూన్ 19, 26, జులై 3వ తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

బొబ్బిలి: హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య

image

బొబ్బిలి మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన కవిటి నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

News May 24, 2024

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగే మొదటి సంవత్సరానికి పరీక్షకు గాను జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ గురవయ్య శెట్టి తెలిపారు. 15,981 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.

News May 24, 2024

కర్నూలు: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం

image

జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఉపాధ్యాయులు తనిఖీ చేసి అనుమతించారు. 69మంది చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించినట్లు డీఈఓ శామ్యూల్ తెలిపారు.

News May 24, 2024

ప.గో: ఓట్ల లెక్కింపు.. 1PMకు తొలి ఫలితం!

image

ఓట్ల లెక్కింపుపై ఉమ్మడి ప.గో.లో ఉత్కంఠ నెలకొంది. ప.గో జిల్లాలో తొలి ఫలితం నరసాపురం కాగా.. ఏలూరు జిల్లాలో ఏలూరు అసెంబ్లీ ఫలితం ఫస్ట్ వెల్లడికానుంది. నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు-16 రౌండ్లు, ఉంగుటూరు-16, కైకలూరు-18, దెందులూరు-18, చింతలపూడి-21, పోలవరం-22, నూజివీడు-22 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. తొలి ఫలితం 1PM, తుది ఫలితం 6PMకు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

News May 24, 2024

నంద్యాల: కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం

image

నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫర్నీచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు.