Andhra Pradesh

News May 24, 2024

ప.గో: ఓట్ల లెక్కింపు.. 1PMకు తొలి ఫలితం!

image

ఓట్ల లెక్కింపుపై ఉమ్మడి ప.గో.లో ఉత్కంఠ నెలకొంది. ప.గో జిల్లాలో తొలి ఫలితం నరసాపురం కాగా.. ఏలూరు జిల్లాలో ఏలూరు అసెంబ్లీ ఫలితం ఫస్ట్ వెల్లడికానుంది. నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు-16 రౌండ్లు, ఉంగుటూరు-16, కైకలూరు-18, దెందులూరు-18, చింతలపూడి-21, పోలవరం-22, నూజివీడు-22 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. తొలి ఫలితం 1PM, తుది ఫలితం 6PMకు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

News May 24, 2024

నంద్యాల: కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం

image

నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫర్నీచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు.

News May 24, 2024

చిత్తూరులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

చిత్తూరు నగరంలోని మిట్టూరు నాయుడు బిల్డింగ్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1-టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. మృతుని ఎడమ చేతికి కుడి చేతికి పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిసినవారు ఈ నంబర్ 9440796707 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News May 24, 2024

రేవ్ పార్టీలో ఇద్దరు విజయవాడ వాసులు అరెస్ట్?

image

బెంగుళూరు రేవ్ పార్టీలో అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డ వారిలో విజయవాడ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వాహకులలో విజయవాడకు చెందిన బుకీ వాసు A1గా, వన్‌టౌన్‌కు చెందిన D. నాగబాబు A3గా FIR నమోదైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. బుకీ వాసు పుట్టినరోజు సందర్భంగా పార్టీ నిర్వహించగా పోలీసుల దాడులలో రేవ్ పార్టీ ఘటన వెలుగు చూసింది.

News May 24, 2024

గుత్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

గుత్తి రైల్వేస్టేషన్‌లోని యార్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందారు. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన మాల కంబగిరి స్వామిగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. కంబగిరి స్వామి చిత్తు పేపర్లు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి యార్డులో చిత్తు పేపర్లు ఏరుకుంటున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 24, 2024

అద్దంకిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

అద్దంకి మండలంలోని శ్రీనివాస్ నగర్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న మొక్కజొన్న లోడు ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని స్థానికులు అంబులెన్స్‌లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 24, 2024

నెల్లూరు: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మధును ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సస్పెండ్ చేశారు. మధు భార్య విజయలక్ష్మి నెల్లూరు 41వ డివిజన్ కార్పొరేటర్. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధు వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఆధారాలను పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేయడంతో.. సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 24, 2024

తిరుమలలో దళారుల మోసం..కేసు నమోదు

image

శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పి నగదు తీసుకుని భక్తులను మోసగించిన ముగ్గురు దళారులపై కేసు నమోదు చేసినట్లు తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుడి నుంచి రూ.20 వేలు తీసుకుని మోసం చేయగా బాధితుడు తిరుమల విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

News May 24, 2024

ఎన్టీఆర్: విధుల్లో అలసత్వం.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

విధులలో అలసత్వం ప్రదర్శించిన జగ్గయ్యపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం ఎం. వాణి, విజయవాడ మొగల్రాజపురం BSRK హైస్కూల్ హెచ్ఎం ఎల్. రమేశ్‌ను DEO యూవీ. సుబ్బారావు తాజాగా సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకల కారణంగా వాణిని, విద్యాశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రమేశ్‌ను సస్పెండ్ చేసినట్లు DEO సుబ్బారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

News May 24, 2024

నెల్లూరు జైలుకు పల్నాడు పెట్రోల్ బాంబుల నిందితులు

image

పోలింగ్ రోజు దాచేపల్లి మండలం తంగెడలో జరిగిన పెట్రోల్ బాంబుల దాడి ఘటనలో నిందితులను నెల్లూరు, గుంటూరు జిల్లా జైలుకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీకి చెందిన 22 మందిని, TDPకి చెందిన 11 మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా 14 రోజులు రిమాండ్ విధించారు. రెండు వర్గాలలో ఒక వర్గం వారిని నెల్లూరు జిల్లా జైలుకు, మరో వర్గం వారిని గుంటూరు జిల్లా జైలుకు పంపారు.