Andhra Pradesh

News May 24, 2024

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 24, 2024

అనంత జిల్లాలో 866మందిని బైండోవర్ చేసిన పోలీసులు

image

అనంతపురం జిల్లాలో గురువారం ఎన్నికల సమయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా 866మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. 176 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొంది.

News May 24, 2024

IFSలో సత్తా చాటిన రంగన్నగూడెం యువకుడు

image

బాపులపాడు మండలం రంగన్నగూడెంకి చెందిన తుమ్మల కృష్ణ చైతన్య ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2023లో జాతీయ స్థాయిలో 74వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కృష్ణ చైతన్య తండ్రి వీర రాజారావు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం అమరావతి సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. IFSలో జాతీయ ర్యాంక్ సాధించిన కృష్ణ చైతన్యను పలువురు అభినందించారు.

News May 24, 2024

VZM: తహశీల్దార్ హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News May 24, 2024

అంతర్జాతీయ పోటీలకు కడప జిల్లా వాసి

image

ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బి. శివ శంకర్ రెడ్డి ఎంపికయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 1వ ఫెడరేషన్ కప్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్- 2024లో 45 ప్లస్ వయో విభాగంలో ఈయన 3 స్వర్ణ పతకాలు సాధించారు.
ALL THE BEST SIR

News May 24, 2024

శ్రీకాకుళం: పోలింగ్ రోజు కొట్లాట.. 28మంది అరెస్ట్

image

పొందూరు మండలం గోకర్ణపల్లిలో ఈనెల 13న ఎన్నికల సమయంలో జరిగిన కొట్లాటకు సంబంధించి 28 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్సై వై.రవికుమార్ తెలిపారు. గోకర్ణపల్లిలో జరిగిన కొట్లాటలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధ, గురువారాల్లో 28 మందిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించగా, అంపోలు జైలుకు తరలించారు.

News May 24, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 43,714 జవాబు పత్రాలు విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పదో తరగతి 2024 మార్చి ఫలితాల్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 43,714 జవాబు పత్రాలను విడుదల చేశారు. 55,966 జవాబు పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 43,714 జవాబు పత్రాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం రాష్ట్ర డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల లాగిన్లలోని జవాబు పత్రాలను దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జారీచేయాలని ఆదేశించారు.

News May 24, 2024

రాజమండ్రి: హోర్డింగ్‌కు ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

రాజమండ్రిలోని బర్మాకాలనీకి చెందిన జొన్నపల్లి వీరబాబు(24) కుటుంబ కలహాల నేపథ్యంలో క్వారీ మార్కెట్ ప్రాంతంలో హోర్డింగుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రింగ్ మేస్త్రి వద్ద కూలి పనులు చేసుకునే అతను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో తగాదాల నేపథ్యంలో మద్యానికి బానిస అయ్యాడని త్రీ టౌన్ సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. రెండంతస్తుల భవనంపై ఉన్న హోర్డింగుకు ఉరివేసుకొని మృతి చెందాడన్నారు.

News May 24, 2024

నేటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం

image

పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని అనంతపురం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి జూన్ 2 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని అన్నారు. 27నుంచి కౌన్సెలింగ్, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.

News May 24, 2024

నందికొట్కూరు: హంద్రీ కాలువలో పడి వ్యక్తి మృతి

image

నందికొట్కూరు మండలం వడ్డెమాను సమీపంలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. ఎస్సై నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. దామగట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు(40) కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతున్నాడు. గురువారం వడ్డెమాను హంద్రీనీవా కాలువలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.