Andhra Pradesh

News May 24, 2024

మదనపల్లి: కూటమి MLA అభ్యర్థిపై ఫిర్యాదు

image

మదనపల్లె కూటమి MLA అభ్యర్థి షాజహాన్‌పై TDP అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షాజహాన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని,తమపై ఇష్టానుసారంగా దూషించారని రామసముద్రం మండలం కురిజల పంచాయితీలోని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ఫిర్యాదు చేశామన్నారు.

News May 24, 2024

తూ.గో జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు

image

రుతుపవనాలు ఈసారి సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందటంతో ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైతులు ఈ నెల 25 నుంచి వరి ఆకుమడులు వేసే అవకాశం ఉంది. జిల్లాలోని 83,068 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల సాగు జరగనుంది. వరి సాగుకు సంబంధించి సమారు 3,850 హెక్టార్లలో నారుమడులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి జూన్‌ 15లోపు నారుమడులు పూర్తి చేసి జూలై నుంచి నాట్లు వేయాల్సి ఉంది.

News May 24, 2024

విశాఖ: తహశీల్దార్ హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News May 24, 2024

నెల్లూరు: విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

image

టీపీ గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందారు. టేబుల్ ఫ్యాన్ వైర్లు తగిలి పడిపోయిన అన్నం నరసయ్యను కాపాడేందుకు వచ్చిన భార్య భాగ్యమ్మ కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News May 24, 2024

పుట్టపర్తి: సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

పుట్టపర్తిలో 10వ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు, జూన్ 1వ తేదీన ఇంటర్ పరీక్షలు ముగుస్తాయని పేర్కొన్నారు. మొత్తం 10,461మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 29, ఇంటర్ పరీక్షల కోసం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ తెలిపారు.

News May 24, 2024

గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి: ఏలూరు డీఈవో

image

ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో అబ్రహం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 11,500 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే నెం.8121840400కు ఫోన్ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.

News May 24, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 28కి వాయిదా

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25లో ప్రథమ ఇంటర్‌లో, ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24, 25వ తేదీల్లో అడవి తక్కెళ్లపాడు అంబేడ్కర్ బాలుర గురుకులంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా సమన్వయకర్త కె. పద్మజ తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం బాలురు ఈనెల 28, బాలికలు 29న ఉదయం 10 గంటలకు గురుకులంలో హాజరు కావాలని తెలిపారు.

News May 24, 2024

ప.గో: సప్లిమెంటరీ పరీక్షలు.. 30ని ముందే అనుమతి

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో ఈ పరీక్షలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంటర్-8,664 మందికి ఉ.9గంటల నుంచి మ.12 వరకు, సెకండ్ ఇంటర్-4,133 మందికి మ.2:30 నుంచి సా.5: 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఫిర్యాదులుంటే 08812 230197కు ఫోన్ చేయాలన్నారు.

News May 24, 2024

కృష్ణా: లా కోర్స్ విద్యార్థులకు గమనిక

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని LLB 4వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 4వ తేదీలోపు అపరాధరుసుం లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజుల వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని కోరాయి.

News May 24, 2024

పుంగనూరు: మహిళపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు

image

బీసీవై కార్యకర్త భార్యపై హత్యాయత్నం చేసిన ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి మండలంలోని మాగాండ్లపల్లె పంచాయతీ బరిణేపల్లెకు చెందిన బీసీవై కార్యకర్త శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చందు, పురుషోత్తం, మంజు, శంకరమ్మ, చంద్రకళ దాడి చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రాఘువీర్ రెడ్డి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.