Andhra Pradesh

News May 24, 2024

సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధం: కలెక్టర్

image

సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని కలెక్టర్ డా.జీ.సృజన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.

News May 24, 2024

శ్రీకాకుళం: పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి

image

పటిష్ఠమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రత, సి.సి. టివిలు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు.

News May 24, 2024

కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ఠ బందోబస్తు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని చోళసముద్రం, మలుగూరు కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో పాటు సుమారు 460 మంది సివిల్ పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని మానిటరింగ్ రూమ్‌కు అనుసంధానం చేసి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

News May 24, 2024

భ్రూణ హత్యలను నివారించండి: తిరుపతి కలెక్టర్

image

జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని, ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని కలెక్టర్ తెలిపారు.

News May 24, 2024

తూ.గో.: సరిగ్గా 11 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.

News May 24, 2024

జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదు: బాపట్ల ఎస్పీ

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకులలో కేవలం వాహనాలలో మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిళ్లలో పోయవద్దని సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లర్లకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

News May 24, 2024

నెల్లూరు: ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కమిటీ సభ్యుల బృందం

image

ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో చివరి ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కౌంటింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌తో కలిసి పరిశీలించారు.

News May 24, 2024

కార్యాలయ వెబ్సైట్‌లో పది రీకౌంటింగ్ ఫలితాలు: ప్రేమ్‌కుమార్

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024కు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసి సంబంధిత కాపీలను విద్యార్థులకు అందజేయవలసిందిగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

News May 24, 2024

ప.గో.: సరిగ్గా 11 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.

News May 24, 2024

కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం: కలెక్టర్

image

కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.