Andhra Pradesh

News September 10, 2025

రాజాంలో రేపు జాబ్ మేళా

image

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News September 10, 2025

ఢిల్లీ చేరిన జిందాల్ భూ నిర్వాసితులు

image

ఎస్.కోట మండలం బొడ్డవరలో 80 రోజులుగా నిరసన తెలిపిన జిందాల్ భూ నిర్వాసితులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం తెలిసిందే. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీకి బయలుదేరిన వీరు బుధవారం చేరుకున్నట్లు జగన్ తెలిపారు. ప్రభుత్వం గిరిజన సమస్యలపై స్పందించకపోవడంతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకు గిరిజనుల సమస్యలను తెలియపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News September 10, 2025

SKLM: అప్పారావు నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని గుడి వీధికి చెందిన ఆంధవరపు అప్పారావు (93) బుధవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి.సుజాత, ఉమశంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News September 10, 2025

నెల్లూరు సమాచార శాఖ డీడీగా వేణుగోపాల్ రెడ్డి

image

నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. అన్నమయ్య జిల్లాలో పౌర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు ప్రమోషన్ ఇచ్చి నెల్లూరుకు బదిలీ చేసింది.

News September 10, 2025

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.

News September 10, 2025

మ్యారేజ్ బ్యూరో అంటూ ప్రొఫెసర్ కూతురికి వల

image

సైబర్ నేరగాడి వలకు చిక్కి ఓ ప్రొఫెసర్ కూతురు రూ.90 వేలు మోసపోయిన ఘటన తిరుపతిలో చోటు చేసుకున్నట్లు రూరల్ CI చిన్నగోవిందు తెలిపారు. ఆయన వివరాలు మేరకు.. మ్యారేజ్ బ్యూరో ద్వారా సంజయ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి వెటర్నటీ వర్సిటీలో పని చేస్తున్న ప్రొ. కూతురికి దగ్గర అయ్యాడు. ఆమెను నమ్మించి రూ.90 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె PSలో ఫిర్యాదు చేసింది.

News September 10, 2025

ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్

image

ఆమదాలవలసలోని చిట్టివలసకు చెందిన నవిరి పూర్ణ (22) వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు.

News September 10, 2025

కర్నూలులో హత్య.. మరో ఇద్దరి అరెస్ట్

image

కర్నూలు 1 టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పార్థసారథి వివరాల మేరకు.. నిందితులు షేక్ ఇమ్రాన్(37), షేక్ యూసుఫ్(22)ను రాఘవేంద్ర ఘాట్ వద్ద పట్టుకొని, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. మొత్తం ఐదుగురు కలిసి షేక్ ఇజహర్ అహ్మద్‌పై దాడి చేసి, హత్య చేసినట్లు వెల్లడైంది.

News September 10, 2025

నేడు ఉండ్రాళ్ళ తద్ది.. విశిష్టత తెలుసా

image

ఉండ్రాళ్ళ తద్ది నోమును భాద్రపద బహుళ తదియ రోజున స్త్రీలు ఆచరిస్తారు. దీని విశిష్టత ఏమంటే, ఈ నోమును పాటిస్తే పెళ్లికాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితులు సుమంగళిగా ఉంటారని నమ్మకం. ఈ నోములో ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెడతారు, కాబట్టి దీనికి ఉండ్రాళ్ల తద్ది అనే పేరు వచ్చింది. ఐదు సంవత్సరాలు ఈ నోమును ఆచరించి, ఉద్యాపన చేసేటప్పుడు వాయనంతో పాటు చీర, రవికలను కూడా సమర్పిస్తారు. 

News September 10, 2025

గాజువాక: మేడ మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

image

మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.