Andhra Pradesh

News May 24, 2024

కృష్ణా: ఈ నెల 25తో ముగియనున్న గడువు

image

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు రాయాల్సిన ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

News May 24, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు పలాస మీదుగా చెన్నై ఎగ్మోర్, సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్-సత్రాగచ్చి (నం.06079), జూన్ 5 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం సత్రాగచ్చి-చెన్నై ఎగ్మోర్ (నం.06080) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం జిల్లాకు రేపు వర్ష సూచన

image

రేపు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News May 23, 2024

కృష్ణా: మత్స్యకారులకు కీలక హెచ్చరికలు

image

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మే 26 సాయంత్రానికి ఈ తుఫాన్ బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరంలో తీవ్ర తుఫానుగా మారుతుందని APSDMA స్పష్టం చేసింది.

News May 23, 2024

గుంటూరు: టెన్త్ పరీక్షలకు 27 ఎగ్జామ్ సెంటర్లు

image

గుంటూరు జిల్లాలో రేపటి నుంచి జూన్ 3 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,373 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంటెంట్లు, శాఖాధికారులు సహా 280 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ అధికారులు నియమించారు.

News May 23, 2024

కృష్ణా: అత్యధిక ఓటింగ్ శాతంతో అదరగొట్టిన 3 నియోజకవర్గాలు

image

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైన 15 నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి కృష్ణా నుంచి 3 సెగ్మెంట్లు చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ నమోదైన జాబితాలో 2వ స్థానంలో జగ్గయ్యపేట (89.89%), 10వ స్థానంలో పెడన (88.57%), 15వ స్థానంలో పామర్రు (88.12%) ఉన్నాయి. కాగా ఏపీలో అత్యధిక పోలింగ్ ప్రకాశం జిల్లా దర్శిలో (90.91%) నమోదైంది.

News May 23, 2024

శ్రీకాకుళం: మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: APSDMA

image

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు ఈ తుఫాను తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని APSDMA స్పష్టం చేసింది.

News May 23, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం

image

రేపు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆరుబయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.

News May 23, 2024

జిల్లాకు భారీ వర్ష సూచన.. అధికారులు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

జిల్లాలో రానున్న 3, 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News May 23, 2024

కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: డీఎస్పీ

image

జూన్ 4న శాంతిరాం ఫార్మసీలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అభ్యర్థి, ఏజెంట్లు తప్ప మరెవరూ రావడానికి వీలు లేదని డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గురువారం స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పాత కేసుల్లో ఉన్నవారు, సమస్యలను లేవనెత్తుతారనే అనుమానం ఉన్న వారికి నోటీసులు జారీ చేశామన్నారు.