Andhra Pradesh

News May 23, 2024

కృష్ణా: అత్యధిక ఓటింగ్ శాతంతో అదరగొట్టిన 3 నియోజకవర్గాలు

image

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైన 15 నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి కృష్ణా నుంచి 3 సెగ్మెంట్లు చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ నమోదైన జాబితాలో 2వ స్థానంలో జగ్గయ్యపేట (89.89%), 10వ స్థానంలో పెడన (88.57%), 15వ స్థానంలో పామర్రు (88.12%) ఉన్నాయి. కాగా ఏపీలో అత్యధిక పోలింగ్ ప్రకాశం జిల్లా దర్శిలో (90.91%) నమోదైంది.

News May 23, 2024

శ్రీకాకుళం: మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: APSDMA

image

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు ఈ తుఫాను తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని APSDMA స్పష్టం చేసింది.

News May 23, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం

image

రేపు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆరుబయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.

News May 23, 2024

జిల్లాకు భారీ వర్ష సూచన.. అధికారులు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

జిల్లాలో రానున్న 3, 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News May 23, 2024

కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: డీఎస్పీ

image

జూన్ 4న శాంతిరాం ఫార్మసీలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అభ్యర్థి, ఏజెంట్లు తప్ప మరెవరూ రావడానికి వీలు లేదని డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గురువారం స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పాత కేసుల్లో ఉన్నవారు, సమస్యలను లేవనెత్తుతారనే అనుమానం ఉన్న వారికి నోటీసులు జారీ చేశామన్నారు.

News May 23, 2024

రాజకీయ నాయకులు సహకరించాలి: కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలన్నారు. గురువారం సాయంత్రం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News May 23, 2024

ఫోన్ ద్వారా ఫిర్యాదులు చెయండి: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అనంతపురం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వేరుశనగ విత్తన పంపిణీ, భారీ వర్షాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులుంటే జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ 18004258803 (OR) 08554-239822కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. దీన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 23, 2024

కడప: చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్

image

చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నల్లపు అంజీ అనే నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ నరసింహ, ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 23, 2024

అనంత: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆకులేడు గ్రామానికి చెందిన రాజు గురువారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

News May 23, 2024

కృష్ణా: రెండో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జూన్ 28 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా జూన్ 4లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్ష ఫీజు వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ను తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు.