Andhra Pradesh

News May 23, 2024

స్ట్రాంగ్ రూములను అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించవచ్చు: ఎన్నికల అధికారి

image

కంట్రోల్ రూంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు, వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు అనుమతి లేదన్నారు.

News May 23, 2024

కృష్ణా: ఓట్ల లెక్కింపుపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ

image

జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపుకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లకు కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ వాణి, శిక్షణా తరగతుల నోడల్ ఆఫీసర్ మురళీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

News May 23, 2024

తాడిపత్రిని అష్టదిగ్బంధనం చేస్తున్న పోలీసులు

image

తాడిపత్రి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డీఐజీ షిమోన్షి, ఎస్పీ గౌతమి శాలి పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల వద్ద క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఎన్నికల పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. వచ్చే నెల 4న వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

News May 23, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన సంపంగి రవిశేఖర్ ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే కోలుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

News May 23, 2024

నేను విజయవాడ అమ్మాయినే: హీరోయిన్ లయ

image

తాను అమెరికా వెళ్లినా విజయవాడ అమ్మాయినేనని.. అందుకే అందరూ తనని తెలుగు అమ్మాయేనని పలకరించారని నటి లయ అన్నారు. 2007లో అమెరికా వెళ్లిన ఆమె..ప్రస్తుతం పిల్లలు పెద్దగవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ‘అలీతో సరదా’ ఇంటర్వ్యూలో చెప్పారు. కోనేరు హంపీ తండ్రి దగ్గర తాను చెస్ నేర్చుకున్నట్లు తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి బాలేదని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు రాయడంపై చాలా బాధపడ్డట్లు ఆమె పేర్కొన్నారు.

News May 23, 2024

టెక్కలి: 25న రగ్బీ జిల్లా స్థాయి అండర్-18 ఎంపికలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీన అండర్-18 జిల్లాస్థాయి రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశంలు గురువారం తెలిపారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణరావును సంప్రదించాలని కోరారు.

News May 23, 2024

చిత్తూరు: ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సగిలి షణ్మోహన్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో సీతమ్స్ కళాశాల, పూతలపట్టు – వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగవరం- మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ టెక్నాలజీలో స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదమం 9 నుంచి 11:30 గంటల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News May 23, 2024

ఓట్ల లెక్కింపు అత్యంత కీల‌క‌ం: కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి

image

ఎన్నిక‌ల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా పూర్తి చేయాల‌ని విజయనగరం క‌లెక్ట‌ర్‌, ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్వోలు, డీటీలు, నోడ‌ల్ అధికారుల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో తొలివిడ‌త అవ‌గాహ‌న‌, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు.

News May 23, 2024

ఎన్టీఆర్: జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు

image

ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 23, 2024

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా విద్యార్థి దశ నుంచి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్న రీతిలో ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు.