Andhra Pradesh

News May 23, 2024

కారంచేడు: తిరుపతికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు

image

కారంచేడుకు చెందిన పొత్తూరి వెంకట శివసుబ్రహ్మణ్యం భార్య రేఖ ప్రియాంక(32), పిల్లలు నిక్షిత్ (5) తేజవర్ధన్ (3)తో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు కుమారిడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కారులో తిరుమలకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం వారు తిరిగి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి బయలుదేరారు. గురువారం వేకువజామున కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ ప్రియాంక మృతిచెందగా, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి.

News May 23, 2024

తిరుపతి ఎస్వీయూలో పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు

image

తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో పులివర్తి నానిని పోలీసులు విచారిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తనపై హత్యాయత్నం చేసినట్లు నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి డీఎస్సీ మనోహరాచారి, సీఐ మురళీ మోహన్ నానిని విచారిస్తున్నారు.

News May 23, 2024

కోడూరు: బైకును ఢీకొన్న ట్రాక్టర్.. యువకుడు మృతి

image

చిట్వేలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిట్వేలి నుంచి గరుగుపల్లికి వెళ్లే రహదారిలో సాయిబాబా గుడి వద్ద ట్రాక్టర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైలపల్లి హరిజనవాడకు చెందిన కేతరాజుపల్లి చందు కిషోర్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 23, 2024

విజయవాడ: ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

image

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయ్యినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధాని మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్‍లు ఎగరవేయటంపై కేంద్రం సీరియస్ అయ్యింది. డ్రోన్లు ఎగురవేసిన వారిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు సమ్మర్ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా నాగర్‌కోయిల్(NCJ), డిబ్రుగర్(DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06103 NCJ-DBRG రైలును జూన్ 7, 14, 21 తేదీలలో, నం.06104 DBRG-NCJ రైలును జూన్ 12, 19, 26 తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 23, 2024

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు

image

విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలును ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా, గుణుపూరు నుంచి విశాఖకు వచ్చే పాసింజర్ ట్రైన్ ఈ నెల 24 నుంచి 27 వరకు రద్దు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-పలాస మధ్య నడిచే పాసింజర్ ట్రైన్‌ను ఈ నెల 27న రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

News May 23, 2024

విజయనగరం: లిఫ్ట్ పేరుతో బంగారం గొలుసు చోరీ

image

పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. గాజులరేగకు చెందిన వెంకటేశ్ 21న ఆంజనేయస్వామి గుడివద్ద నిలబడ్డాడు. లంకాపట్నంకు చెందిన ఏసు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, చైన్ లాక్కోగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద స్కూటీని, బంగారం గొలుసు రికవరీ చేసినట్లు చెప్పారు.

News May 23, 2024

బాపట్ల జిల్లాలో APPSC పరీక్ష నిర్వహణ

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీన బాపట్లలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు బుధవారం పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో 200 మంది అభ్యర్థులు APPSC పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

News May 23, 2024

కృష్ణా: నదిలోఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

మండలంలోని మద్దూరులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులలో కార్తీక్(13) ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందాడు. సెలవులకు వచ్చి కానరాని లోకానికి తనయుడు వెళ్లడంతో తల్లిదండ్రులు‌ శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 23, 2024

CNAలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పుట్టపర్తి కుర్రాడికి గోల్డ్ మెడల్స్

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన ఎం.శ్రీకాంత్ యాదవ్ సీఎన్‌ఏలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించారు. సందర్భంగా గురువారం వెస్ట్ బెంగాల్‌లో ఆ విద్యార్థికి 9 గోల్డ్ మెడల్స్, ఒక ప్లాటినం, ప్రైజ్ మనీతో సీఎన్ఏ సంస్థ ప్రతినిధులు ప్రదానం చేశారు. శ్రీకాంత్ కుటుంబంతో సహా వెళ్లి ఈ బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. పలువురు శ్రీకాంత్‌ను అభినందించారు.