Andhra Pradesh

News May 23, 2024

బాపట్ల జిల్లాలో APPSC పరీక్ష నిర్వహణ

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీన బాపట్లలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు బుధవారం పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో 200 మంది అభ్యర్థులు APPSC పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

News May 23, 2024

కృష్ణా: నదిలోఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

మండలంలోని మద్దూరులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులలో కార్తీక్(13) ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందాడు. సెలవులకు వచ్చి కానరాని లోకానికి తనయుడు వెళ్లడంతో తల్లిదండ్రులు‌ శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 23, 2024

CNAలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పుట్టపర్తి కుర్రాడికి గోల్డ్ మెడల్స్

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన ఎం.శ్రీకాంత్ యాదవ్ సీఎన్‌ఏలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించారు. సందర్భంగా గురువారం వెస్ట్ బెంగాల్‌లో ఆ విద్యార్థికి 9 గోల్డ్ మెడల్స్, ఒక ప్లాటినం, ప్రైజ్ మనీతో సీఎన్ఏ సంస్థ ప్రతినిధులు ప్రదానం చేశారు. శ్రీకాంత్ కుటుంబంతో సహా వెళ్లి ఈ బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. పలువురు శ్రీకాంత్‌ను అభినందించారు.

News May 23, 2024

స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ సృజన గురువారం పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను భద్రపరచిన లైఫ్ సైన్సెస్ బ్లాక్‌ను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో సంతకం చేశారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎన్నికల అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పాల్గొన్నారు.

News May 23, 2024

కృష్ణా: ‘నియోజకవర్గానికి 14 టేబుల్స్’

image

జూన్ 4న నిర్వహించే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సీఈఓ మీనా జిల్లా కలెక్టర్లతో VC నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు. కౌంటింగ్ నిర్వహణకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా ప్రతి టేబుల్‌కి ఒక సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ని నియమించామన్నారు.

News May 23, 2024

ఉదయగిరి: రేపే ఇంటర్ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి పరీక్షా కేంద్రం చీఫ్ మారెళ్ల వాసు బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆరు రోజులు పాటు జరిగే ఇంటర్ పరీక్షలకు 144 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం ఐదు పరీక్ష రూములలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం మొదటి సంవత్సరం మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు.

News May 23, 2024

ప.గో: రైలు పట్టాలపై మహిళ మృతదేహం

image

నిడదవోలు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య నిన్న రాత్రి గుర్తు తెలియని మహిళ మృతి చెంది పడి ఉన్నట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. దారవరం రైల్వే గేటు సమీపంలో డౌన్ లైన్ పక్కన మహిళ మృతదేహం లభ్యమైందని, సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. వివరాలేమీ లభ్యం కాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News May 23, 2024

అచ్చంపేట వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మండలంలోని సండ్రతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కోనూరుకు చెందిన వెంకటేశ్వర్లు (70) మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోనూరు నుంచి మఠంపల్లి తిరునాళ్లకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

News May 23, 2024

విశాఖ: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్

image

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ ఏర్పాటయింది. జాయింట్ సీపీ, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్స్ దీనిలో ఉంటారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆదేశించారు. కాగా ఆపరేషన్ కంబోడియా విజయవంతమైందని అధికారులు తెలిపారు. 360 మంది భారతీయులను ఎంబసీ ఆఫ్ ఇండియా కాపాడింది.

News May 23, 2024

అనంత: బైండోవర్ పేరుతో వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు

image

అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసి వైసీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాడిపత్రిలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని పోలీసులు వైసీపీ నాయకులపై బైండోవర్ కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అంతటా ఇలా కేసులు నమోదు చేస్తున్నారని వెంటనే వాటిని ఆపించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.