Andhra Pradesh

News May 23, 2024

ప్రకాశం: నిర్మాతగా మారిన మహిళా రైతు

image

కొనకనమిట్ల మండలం పెదారికట్ల చెందిన సాధారణ ఒక రైతు కుటుంబంలో పుట్టిన నరసమ్మ ఒక సినిమాకు నిర్మాతగా మారింది. కరోనా కారణంగా అదే ఊర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ హోటల్ పెట్టి జీవనం సాగించేది. ఆమెకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. దీంతో ఓ సినిమా తీయాలనే ఆశ కూడా ఉండేది. తన 45 సంవత్సరాలుగా రూపాయి రూపాయి కూడబెట్టింది. ప్రస్తుతం ఆమె ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

News May 23, 2024

కళ్యాణదుర్గం: రైతుపై ఎలుగుబంటి దాడి

image

శెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామ శివారులో పొలం పనులకు వెళుతున్న హనుమంతరాయుడు అనే రైతుపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. హనుమంతరాయుడు పొలంలోకి వెళుతున్న సమయంలో ఓ ఎలుగుబంటి అతడిపై దాడి చేసి కరిచింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.

News May 23, 2024

అనంత: వేరుశనగ కోసం 31,555 మంది రైతులు పేర్లు నమోదు

image

అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనం కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 27,868 క్వింటాళ్లకు 31,555 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని డీఏవో ఉమామహేశ్వరమ్మ, ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 24, 520 క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు ప్రాసెసింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 23, 2024

నంద్యాల: జూన్ 1తేది నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

నంద్యాల: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ సుధాకర్రెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణలు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. హాల్ టికెట్‌లను https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News May 23, 2024

కడప: మంత్రి పదవి వరించని నియోజకవర్గాలు ఇవే

image

కడప జిల్లాలో ఇప్పటి వరకు MLAలుగా గెలిచి మంత్రి పదవులు పొందిన వారు చాలామంది ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయచోటి MLAల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఎక్కువగా కడప నియోజకవర్గ MLAలకు మంత్రి పదవులు దక్కాయి. కడప నుంచి ఆరుగురికి, జమ్మలమడుగు, పులివెందుల నుంచి ముగ్గురికి, రాజంపేటలో ఇద్దరికి, కోడూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు నుంచి ఒక్కొక్కరికి పదవులు దక్కాయి. ఈ సారి ఎవరికి వరిస్తుందో కామెంట్ చేయండి.

News May 23, 2024

సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందనం సమర్పణ

image

వైశాఖ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సమర్పణను వైభవంగా నిర్వహించారు. మొదటి విడత మే 10వ తేదీన 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించగా, రెండో విడత గురువారం మరో 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించారు. పలువురు భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

News May 23, 2024

ఈ నెల 24 నుంచీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈనెల 24 నుంచి జూన్ 3వ తేది వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డిఈఓ బి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 45 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఉదయం 9: 30 గంటల నుంచి 12:45 గంటల వరకు జరిగే పరీక్షలకు 13,332మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 23, 2024

శ్రీకాకుళం: తలనొప్పి తట్టుకోలేక వివాహిత సూసైడ్

image

ఇచ్చాపురం మండలం డోంకూరులో బుధవారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ఉష(30) కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుంది. బుధవారం తీవ్రమైన తలనొప్పి రాగా, భరించలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుపల్లి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు నందన(10), రిత్విక్(5) సంతానం.

News May 23, 2024

మనుబోలు : వామ్మో చికెన్ @330..

image

చికెన్ ప్రియులను ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి..చికెన్ ధర అమాంతం పెరిగింది. మనుబోలు మార్కెట్లో బుధవారం చికెన్ ధర ఏకంగా రూ.330 అయింది. దీంతో మాంసం ప్రియులు కడుపు నిండా చికెన్ తినాలంటే జేబులు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News May 23, 2024

పుంగనూరు: బీసీవై మద్దతుదారుపై దాడి

image

బీసీవై పార్టీ మద్దతుదారుపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు బాధితురాలు ఆరోపించింది. బర్నేపల్లి గ్రామానికి చెందిన శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ బుధవారం కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె ఆరోపించింది. ఆమె భర్త శంకర్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో సబ్ జైల్లో ఉన్నారు. సీఐ రాఘవరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.