India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.
ఏపీలో సంచలనం రేకెత్తించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు డోర్‌డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సెల్ సభ్యుడు, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది.
ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బంగారు బాల్యం ప్రాజెక్టుకు జిల్లా నోడల్ అధికారిగా రాచర్ల ఎంఈవో గిరిధర్ శర్మను జిల్లా కలెక్టర్ అన్సారియా నియమించారు. జిల్లా స్థాయి వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో బడి ఈడు గల బాలలకు సంబంధించిన అంశాల పైన జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరి నియామకం పట్ల పలువురు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
నెల్లూరు జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కావలి పట్టణంలో ఇదే తరహాలో ఊరు చివర కారు పెట్టుకుని ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. వైట్ షిఫ్ట్ కారు ఊరి శివారు ఏరియాలో ఉంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్-2025గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తిగా ఆయనకు వచ్చిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. మన రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణమన్నారు. శ్రమ, సమర్ధత, విజన్ కలిగిన యువ నాయకుడు రామ్మోహన్ అని ఎంపీ ప్రశంసించారు.
నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి ఆర్థిక సహాయంతో నెల్లూరు జిల్లాకు చెందిన 26 మంది దివ్యాంగులకు రూ.74,57,500 చెక్కులను జాయింట్ కలెక్టర్ కార్తీక్ పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పనులు చేసుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ఏ.మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్‌లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర శక్తి యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కడప: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకుపోతున్న వైవీయూకు మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ పార్టనర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి రూ.10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థలతో కలసి వైవీయూ రీసెర్చ్ చేస్తుందని వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు.
జీవీఎంసీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పారదర్శకంగా జరగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు గురువారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 19న జీవీఎంసీలో నిర్వహించబోయే అవిశ్వాస తీర్మానంపై కార్పొరేటర్లపై బలవంతపు ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారులు గమనించి పారదర్శకంగా చేపట్టాలని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.