Andhra Pradesh

News September 24, 2024

నంద్యాల: పీజీఆర్‌ఎస్‌కు 135 ఫిర్యాదులు

image

నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 135 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై అధికారులు చొరవచూపి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రతి పోలీస్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.

News September 24, 2024

పుట్టపర్తి: జిల్లా ఎస్పీ కార్యాలయానికి 76 వినతులు

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వి రత్న ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 76 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు తెలిపారు.

News September 24, 2024

చిత్తూరు: పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

image

ఉద్యానవన శాఖలో అమలు చేస్తున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో పథకాలను తెలిపే పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40% రాయితీ అందిస్తున్నట్టు చెప్పారు. పాలి హౌసులు, షెడ్ నెట్ హౌసులు, మల్చింగ్ కు 50% రాయితీ అందిస్తున్నామన్నారు. చిన్న ట్రాక్టర్లు, స్ప్రేయర్లు రాయితీతో అందిస్తామన్నారు.

News September 24, 2024

మంగళగిరి: ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష

image

నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై చర్చించిన లోకేశ్ పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి ప్రాంతాల్లో నైపుణ్యగణన చేపట్టాలని ఆదేశించారు.

News September 24, 2024

ఈనెల 28న జిల్లాలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం

image

ఈనెల 28వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాల మంజూరైన గృహాలను పూర్తి చేయాలనే అంశంపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 31,449 గృహాలు మంజూరు అయ్యాయని, అందులో కొన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు.

News September 24, 2024

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులు

image

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుట కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News September 24, 2024

అమరావతి: చేనేత జౌళి శాఖపై మంత్రి సమీక్ష

image

చేనేత, జౌళి శాఖాధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని సచివాలయం నాలుగో బ్లాక్‌లో రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ ఆ శాఖ మంత్రి ఎస్.సవితమ్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులు పరిశ్రమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

News September 24, 2024

విజయనగరం జిల్లా టూడే టాప్ న్యూస్

image

*పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సర్పంచుల ఆందోళన
*స్వగ్రామానికి చేరుకున్న మెడికో అమృత మృతదేహం
*పడాల శరత్ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్
*చీపురుపల్లి: గణేశుడి నిమజ్జనంలో వైసీపీ పాటలకు డ్యాన్సులు (VIDEO)
*పూసపాటిరేగ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
*విజయనగరంలో భారీ వర్షం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
*జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లకు ఈ నెల 25న పరిహారం: కలెక్టర్
*VRD కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ

News September 24, 2024

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడికి నోటీసులు

image

మాజీ డిప్యూటీ సీఎం, కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప తాలూకా పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిలో తాలూకా పరిధిలో ఓ స్థల విషయంలో జరిగిన గొడవకు సంబంధించి విచారణ కోసం పోలీసులు పిలిపించారు. అయితే విచారణకు సమయం పడుతుందన్న కారణంగా ఆయనను వెనక్కు పంపారు. తిరిగి విచారణకు పిలిచినప్పుడు రావాలని అతనికి సూచించారు.

News September 24, 2024

పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ పురందీశ్వరి

image

ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రిని పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు, నాయకులతో కలిసి సమస్యలను వివరించారు. ఆ సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.