Andhra Pradesh

News May 23, 2024

కర్నూలు: మహిళల మృతిలో వీడిన మిస్టరీ

image

నగరవనం చెరువులో మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మమబూబ్ బాషాను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు..మహబూబ్‌నగర్(D)కు చెందిన జానకి, అరుణలు వేశ్యవృత్తిలో కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. ఈక్రమంలో బాషాతో పరిచయం ఏర్పడింది. మనస్పర్థలతో జానకి అతడిని కొట్టించింది. ఈనెల19న వారిద్దరు బాషా ఆటోలోనే బట్టలు ఉతకడానికి వెళ్లారు. అవకాశం కోసం చూస్తున్న బాషా జానకిని చెరువులోకి తోశాడు. కాపాడే క్రమంలో అరుణ కూడా మునిగిపోయింది.

News May 23, 2024

సింహాచలం: నేడు అంతరాలయ దర్శనం రద్దు

image

వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయంలో అప్పన్న బాబుకు రెండవ విడత చందనం సమర్పించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అంతరాలయ దర్శనం రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.300 టికెట్ తీసుకుని భక్తులకు నీలాద్రి గుమ్ము వద్ద నుంచి లఘు దర్శనం ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. బైక్‌లను గణపతి సత్రం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతంలో నిలపాలన్నారు.

News May 23, 2024

TPT: హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

తిరుపతి జూ పార్క్ సమీపంలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (SIHMCT) 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం తెలిపింది. హోటల్ మేనేజ్మెంట్, క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు https://sihmtpt.org/ వెబ్‌సైట్ లో చూసుకోవచ్చన్నారు.

News May 23, 2024

VZM: పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

image

విజయనగరం గిరిజన యూనివర్సిటీలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు తుది గడువును ఈ నెల 26వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.తేజస్వి కట్టిమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష రాసిన వారు 26వ తేదీ రాత్రి 11.55 వరకు https://www.ctuap.ac.in లో గాని https://ctuapcuet.samarth.edu.in/pg లో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News May 23, 2024

ఎలమంచిలిలో రెండు బైకులు ఢీ ఒకరు మృతి

image

లక్కవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు. నక్కపల్లి మండలం దోసలపాడుకి చెందిన లక్ష్మణరావు మరో ముగ్గురుతో కలిసి బైక్‌లపై గాజువాక బయలుదేరారు. లక్కవరం సమీపంలో వెనుక వస్తున్న బైక్ లారీని తప్పించబోయి ముందున్న బైక్‌ని ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

News May 23, 2024

కాకినాడ: ACB వలలో పరిశ్రమల శాఖ GM

image

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ.మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ మురళి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

News May 23, 2024

నన్ను జైలులోనే చంపాలని చూశారు: రఘురామ

image

జగన్‌ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్‌‌లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.

News May 23, 2024

నన్ను జైలులోనే చంపాలని చూశారు: రఘురామ

image

జగన్‌ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్‌‌లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.

News May 23, 2024

ఛలో మాచర్లకు టీడీపీ.. అనుమతి లేదన్న పల్నాడు ఎస్పీ

image

టీడీపీ తలపెట్టిన ‘ఛలో మాచర్ల’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులూ లేవని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. జిల్లాలో 144 CRPC సెక్షన్ అమలులో ఉన్నందున టీడీపీ ఛలో మాచర్ల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేదన్నారు. TDP రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సదరు సమావేశంలో పాల్గొనడం, ర్యాలీగా వెళ్ళటం చెయ్యకూడదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 23, 2024

శ్రీకాకుళం: వీడిన మర్డర్ మిస్టరీ .. భార్య అరెస్ట్

image

నగర పాలక సంస్థ పరిధి గూనపాలెంలో హత్యకు గురైన సీర సురేశ్ (34) మర్డర్ మిస్టరీ వీడింది. అనుమానంగా ఉన్న మృతుడు భార్య తిరుమలను ఈ మర్డర్లో కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసి నిందితురాలు తిరుమలను బుధవారం సీఐ సన్యాసినాయుడు, 1 టౌన్ ఎస్సై బలివాడ గణేశ్ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య తిరుమలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు స్పష్టం చేశారు.