Andhra Pradesh

News May 23, 2024

కొండపిలో రికార్డు ధర పలికిన పొగాకు

image

ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర కిలో రూ.320 పలికిందని, కొండపి బోర్డు చరిత్రలోనే రికార్డు ధర అని వేలం నిర్వహణాధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. చతుకుపాడు, కె. అగ్రహారం, మూగచింతల, గుర్రప్పడియ, నెన్నూరుపాడు గ్రామాలకు చెందిన రైతులు 1077 బేళ్లు తీసుకొనిరాగా 1018 బేళ్లు కొనుగోలయ్యాయి.

News May 23, 2024

కడప: ఆ కాలేజ్‌కు వైవీయు గుర్తింపు లేదు

image

ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఉన్న శ్రీ మలయాళ స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేటి వరకు వైవీయు నుంచి ఎలాంటి గుర్తింపు లేదని విశ్వవిద్యాలయ కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ ఆచార్య కె. రఘుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కళాశాలలో బీఈడీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని ఆయన పేర్కొన్నారు.

News May 23, 2024

అప్రమత్తంగా ఉండండి: నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 23, 2024

పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.

News May 23, 2024

తూ.గో: ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశం కోసం ఈ నెల 25వ తేదీ శనివారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి వెంకట్రావు బుధవారం తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్‌లో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. పదో తరగతిలో పొందిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన అర్హత కలిగిన బాలుర, బాలికలకు అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.

News May 23, 2024

ప్రకాశం: ‘హాల్ టికెట్లు సిద్ధం డౌన్‌లోడ్ చసుకోండి’

image

పదవ తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈ నెల 24వ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. హాల్ టికెట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ నుంచి పాఠశాలల హెచ్ఎంల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

News May 23, 2024

రాజంపేట: అల్లరిమూకల అణచివేతకు ప్రత్యేక బృందాలు

image

అసలే ఎన్నికల వాతావరణం.. ఓట్ల లెక్కింపు అనంతరం అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు కార్డెన్ సెర్చ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులందరూ రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతిభద్రతలకు అఘాతం కలగకుండా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

News May 23, 2024

ఆర్థిక ఇబ్బందుల్లో సాలూరు లారీ పరిశ్రమ

image

రాష్ట్రంలో విజయవాడ తరువాత జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 2300 వరకు లారీలు ఉన్నాయి. ఈ మోటారు పరిశ్రమపై 18 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతమందికి జీవనాధారమైన ఈ పరిశ్రమ పెరిగిన ఆయిల్, విడిభాగాలు ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగకపోవడంతో బాటు లోడింగ్ లేక అధిక మొత్తం లారీలు యార్డ్‌లోనే ఉంటున్నాయి. దీనివలన చాలా కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.

News May 23, 2024

ఏలూరు: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన డీఐజీ

image

ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను డీఐజీ అశోక్ కుమార్ బుధవారం పరిశీలించారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News May 23, 2024

వైసీపీ విజయోత్సవానికి అందరూ సిద్ధం కండి: మంత్రి ఉషశ్రీ చరణ్

image

గోరంట్ల, పెనుకొండ రూరల్, అర్బన్ మండలాల నాయకులు, కార్యకర్తలతో మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయడంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం తథ్యం అన్నారు. పెనుకొండ కోటపై మరోసారి వైసీపీ జెండా కచ్చితంగా ఎగరవేస్తామని తెలిపారు. వైసీపీ పార్టీ విజయోత్సవానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.