Andhra Pradesh

News May 22, 2024

24 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు: ఆర్ఐఓ

image

ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్ఐఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదటి సంవత్సరానికి 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో 15,981 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 2వ సంవత్సరానికి 22 పరీక్షా కేంద్రాలలో 6,962 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News May 22, 2024

మూడంచెల భద్రతను పరిశీలించిన ఎస్పీ శ్రీధర్

image

కాట్రేనికోన మండలం చెయ్యేరులో శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘాను మరియు ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను తనిఖీ చేశారు. ఇబ్బందికి తగు చూశాను అందించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా జిల్లాలో జూన్ 10 వరకు బాణాసంచా తయారీని నిషేధించామన్నారు.

News May 22, 2024

పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు

image

గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఏ క్షణాన ఎవరిపై దాడికి వస్తుందోనన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు రైతులు పంట పొలాలను దుక్కులు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతాల నుంచి తరలించాలని కోరుతున్నారు.

News May 22, 2024

ఈనెల 27 లోగా ఫామ్-18లో ఏజెంట్ల వివరాలు ఇవ్వండి: కలెక్టర్

image

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసుల జారీకి సంబంధించి ఈనెల 27వ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్-18 ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 22, 2024

పాకాల: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం లభ్యం

image

పాకాలలోని రైలు పట్టాలపై బుధవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తలారివారిపల్లెకు చెందిన మురళీగా వారు గుర్తించారు. కాగా శుక్రవారం ఫకీరుపేటకు చెందిన ఓ యువతిని మురళీ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మురళీ కనిపించకుండా పోగా.. నేడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. యువతి కుటుంబ సభ్యులే మురళీని హత్య చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.

News May 22, 2024

మెలియాపుట్టి: ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

image

పాతపట్నం మండలం ద్వారకాపురి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెలియాపుట్టి మండలం తుమ్మకొండ రామచంద్రపురం గ్రామానికి చెందిన అప్పల నరసమ్మ (45) ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. తన కన్నవారి సృష్టి జగన్నాధపురం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు క్రాస్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

News May 22, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30వరకు నం.07278 భద్రాచలం రోడ్- విజయవాడ, నం.07979 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News May 22, 2024

అనంత: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

image

పుట్లూరు మండలంలో యువతి బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మండల పరిధిలోని మడ్డిపల్లిలో ఇందు అనే యువతి అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు.

News May 22, 2024

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు.. కాకినాడ ఎస్పీ హెచ్చరిక

image

కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ సతీశ్ కుమార్ చెప్పారు. వివిధ పార్టీల నాయకులతో బుధవారం ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున చిన్న చిన్న ఘటనలు జరిగాయని, లెక్కింపు సందర్భంగా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 22, 2024

మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొనకనమెట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు రాచకొండ వెంకటేశ్వర్లు (32)గా గుర్తించారు. చిన్నారికట్ల నుంచి పెద్దరికట్ల గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.