Andhra Pradesh

News May 22, 2024

ప.గో: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

ముత్యాపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన ఇంటిలో ఉండగా ఉదయం 6గంటల సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అదే నిమిషంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. అక్కడ భద్రతా సిబ్బంది పనితీరును, సీసీ కెమెరాలు విభాగాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల అభ్యర్థుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

News May 22, 2024

శ్రీకాకుళం: ఎస్పీని సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

image

లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ రాధికను అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు గాను అధిక ఓటింగ్ శాతం నమోదు, ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించినందుకు గాను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ఆమెను సత్కరించి, అభినందనలు తెలిపారు. వారిలో ప్రతినిధులు సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, తదితరులు ఉన్నారు.

News May 22, 2024

అప్రమత్తంగా ఉండండి: నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 22, 2024

అల్లర్లు సృష్టించే వారు ఒకసారి ఆలోచించండి: ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకను తిప్పి కొట్టడానికి శాఖ టీంలు రెడీగా ఉన్నాయని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో జరిగిన మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అల్లర్లు సృష్టించాలని రోడ్డు ఎక్కేవారు ఒకసారి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించి రోడ్డుపైకి వెళ్లాలని సూచించారు. ఏది ఏమైనా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.

News May 22, 2024

కృష్ణా: రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో రేపు గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. అటు పొరుగున ఉన్న ఏలూరు జిల్లాలో సైతం వర్షాలు పడతాయని APSDMA హెచ్చరించింది.

News May 22, 2024

అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ కే.శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం ఆయన ఇసుక అక్రమ తవ్వకాలపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.

News May 22, 2024

కడప: రైలు కింద పడి యువకుడు సూసైడ్

image

వల్లూరు మండలం తొల్లగంగనపల్లి సమీపంలో రైలు కింద పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకి మల్లికార్జున (17) రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితమే మల్లికార్జున తల్లిదండ్రులు మరణించారు.

News May 22, 2024

కృష్ణా: తమిళనాడు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నెం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News May 22, 2024

స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా చేపట్టామని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఏర్పాటు చేశామని తెలిపారు.