Andhra Pradesh

News May 22, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు నైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30వరకు నం.07278 భద్రాచలం రోడ్- విజయవాడ, నం.07979 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News May 22, 2024

శ్రీకాకుళం: ‘కొరియర్ కాల్స్‌పై అప్రమత్తత అవసరం’

image

కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దీపిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన ఐటమ్ యొక్క పార్సల్౨లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని కేసు నమోదైందని సీబీఐ లేదా పోలీసుల మంటూ సైబర్ నేరగాళ్లు బెదిరిస్తారని చెప్పారు. విచారణకు రమ్మంటారని, రాలేమంటే ఆన్లైన్లోనే రావచ్చునని చెప్పి, ఓ లింక్ పంపిస్తారని దాన్ని తెరిస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయని ఎస్పీ వివరించారు.

News May 22, 2024

బాణసంచా విక్రయాలపై నిషేధం: కలెక్టర్‌

image

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు తూ.గో జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. జూన్‌ 4వ తేదీ కౌంటింగ్‌ జరగనున్నందున ఆ రోజు ఎక్కడా బాణసంచా కాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News May 22, 2024

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: టీడీపీ నేతలు

image

టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. బుధవారం అమరావతిలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. సంబంధం లేని కేసులలో టీడీపీ నేతలను చేర్చి వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పారు. తాడిపత్రిలో పోలీసులు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు.

News May 22, 2024

రోడ్డు ప్రమాదాలు తగ్గించుటకు కృషి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించుటకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో వివిధ శాఖల (రవాణా, పరిశ్రమలు, ఏ.పీ.ఐ.ఐ.సీ, పర్యాటక, కార్మిక, చేనేత, కాలుష్య నియంత్రణ) ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News May 22, 2024

VZM: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి 31 వ‌ర‌కు ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభంకానున్నాయి. మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు 14,904 మంది, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్ధులు 7,927 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కానున్నారు. మొత్తం 42 ప‌రీక్షా కేంద్రాల్లో, మొద‌టి సంవ‌త్స‌ర ప‌రీక్ష ఉద‌యం 9 నుంచి 12 గంట‌లు వ‌ర‌కు, రెండో సంవ‌త్స‌ర ప‌రీక్ష మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వ‌ర‌కు జ‌రుగుతుందని అధికారులు తెలిపారు.

News May 22, 2024

ప్రకాశం: ఓట్ల లెక్కింపు కోసం అబ్జర్వర్ల నియామకం

image

ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం అబ్జర్వర్లను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులను నియమించారు. బాపు గోపీనాథ్(సంతనూతలపాడు), మయూర్ కె మహత(వైపాలెం), గుంజం సోనీ(దర్శి), అరవింద కుమార్ (OGL), అనిమేష్(MRKP), ఆనంద్ కుమార్ (కొండపి), ఆల్టినోలిన్(గిద్దలూరు), బి.నరేంద్ర(కనిగిరి)లను నియమించారు.

News May 22, 2024

కడప: ‘విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగనన్న విద్యాదీవెన డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని TNSF కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.

News May 22, 2024

స్టీల్ ప్లాంట్: 23న మిగిలిన వేతనాల చెల్లింపు

image

వేతనాల విషయమై స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ అఖిలపక్ష కార్మిక నేతలతో బుధవారం చర్చించారు. ఈ నెల 21న 50% జీతాలు చెల్లించడంతో మిగిలిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అడ్మిన్ భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సీఎండీ వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ నెల 23న మిగిలిన 50% వేతనాలు చెల్లిస్తామని సీఎండీ హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.

News May 22, 2024

విజయనగరం: టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న టెన్త్‌ అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ, ఇంట‌ర్ సప్లిమెంటరీ ప‌రీక్షల‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. పదోతరగతి, ఇంట‌ర్, సప్లిమెంటరీ, డైట్ సెట్ పరీక్షల నిర్వహణపై త‌న ఛాంబర్‌లో అధికారులతో బుధవారం స‌మీక్షించారు. ఆయా శాఖల అధికారుల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు.