Andhra Pradesh

News May 22, 2024

పెదవేగి: మహిళ అనుమానాస్పద మృతి

image

పెదవేగి మండలం మండూరు పంచాయతీ పరిధి బొడ్డువారిగూడెంలో బడుగు ధనలక్ష్మి (39) అనే వివాహిత ఊరికి వేలాడుతూ విగతజీవిగా బుధవారం స్థానికులకు కనిపించింది. దీంతో వారు మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 22, 2024

మాచర్ల: TDP ఏజెంట్‌కు చంద్రబాబు ఫోన్ కాల్

image

పాల్వాయిగేట్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుపడి, గాయపడిన TDP ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాల్ చేశారు. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు, అరెస్ట్ వార్తల నేపథ్యంలో శేషగిరిరావు అజ్ఞాతం వీడి ఇవాళ బయటికొచ్చారు. ఈ క్రమంలో ధైర్యంగా పోరాడావని చంద్రబాబు ఆయన్ను అభినందించారు.

News May 22, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా చెన్నై ఎగ్మోర్, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06077 చెన్నై ఎగ్మోర్- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 1 నుంచి 29 వరకూ ప్రతి శనివారం, నం.06078 సత్రాగచ్చి- చెన్నై ఎగ్మోర్ ట్రైన్‌ను జూన్ 3 నుంచి జూలై 1 వరకూ ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది.

News May 22, 2024

విజయవాడ: బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్ రద్దు

image

విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహణ కారణాల వల్ల కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని సూచించింది.

News May 22, 2024

కృష్ణా: PGECET- 2024 హాల్ టికెట్లు విడుదల

image

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి తెలిపింది. కాగా PGECET పరీక్షను ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తామని APSCHE వర్గాలు స్పష్టం చేశాయి.

News May 22, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ మల్లికార్జున

image

ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్షించారు. విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక ఎంపీ నియోజకవర్గం ఓట్లను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించడానికి అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

News May 22, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

image

అనంతపురంలోని కురుగుంట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కమరుపల్లి గ్రామానికి చెందిన వంశీ, ప్రశాంత్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వంశీ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 22, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంబల్‌పూర్(SMP), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 23 నుంచి జూన్ 27 వరకు ప్రతి గురువారం SMP- SMVB(నం.08321), మే 25 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం SMVB- SMP(నం.08322) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News May 22, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘాటెక్కిన పచ్చి మిర్చి

image

నిత్యావసరంగా వాడుకునే పచ్చి మిర్చి ధర ఘాటెక్కింది. ఎన్నడూ లేని విధంగా యర్రగొండపాలెంలో కిలో పచ్చి మిర్చి రూ.100కి చేరింది. పశ్చిమ ప్రాంతంలో ఎక్కడా వేసవిలో మిర్చి సాగు చేయలేదు. పుల్లలచెరువు, మల్లపాలెం, నాయుడుపాలెం, చాపలమడుగు ప్రాంతాల్లో అరకొరగా సాగు చేశారు. దీంతో పచ్చిమిర్చిని మైదుకూరు నుంచి రోజుకు 50 క్వింటాళ్ల దిగుమతి చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.

News May 22, 2024

శ్రీకాకుళం: PGECET- 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల

image

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి తెలిపింది. కాగా PGECET పరీక్షను ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తామని APSCHE వర్గాలు స్పష్టం చేశాయి.