Andhra Pradesh

News September 24, 2024

ఈనెల 28న జిల్లాలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం

image

ఈనెల 28వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాల మంజూరైన గృహాలను పూర్తి చేయాలనే అంశంపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 31,449 గృహాలు మంజూరు అయ్యాయని, అందులో కొన్ని ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు.

News September 24, 2024

అమరావతి: చేనేత జౌళి శాఖపై మంత్రి సమీక్ష

image

చేనేత, జౌళి శాఖాధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని సచివాలయం నాలుగో బ్లాక్‌లో రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ ఆ శాఖ మంత్రి ఎస్.సవితమ్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులు పరిశ్రమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

News September 24, 2024

విజయనగరం జిల్లా టూడే టాప్ న్యూస్

image

*పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సర్పంచుల ఆందోళన
*స్వగ్రామానికి చేరుకున్న మెడికో అమృత మృతదేహం
*పడాల శరత్ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్
*చీపురుపల్లి: గణేశుడి నిమజ్జనంలో వైసీపీ పాటలకు డ్యాన్సులు (VIDEO)
*పూసపాటిరేగ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
*విజయనగరంలో భారీ వర్షం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
*జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లకు ఈ నెల 25న పరిహారం: కలెక్టర్
*VRD కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ

News September 24, 2024

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడికి నోటీసులు

image

మాజీ డిప్యూటీ సీఎం, కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప తాలూకా పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిలో తాలూకా పరిధిలో ఓ స్థల విషయంలో జరిగిన గొడవకు సంబంధించి విచారణ కోసం పోలీసులు పిలిపించారు. అయితే విచారణకు సమయం పడుతుందన్న కారణంగా ఆయనను వెనక్కు పంపారు. తిరిగి విచారణకు పిలిచినప్పుడు రావాలని అతనికి సూచించారు.

News September 24, 2024

పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ పురందీశ్వరి

image

ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రిని పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు, నాయకులతో కలిసి సమస్యలను వివరించారు. ఆ సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.

News September 23, 2024

రాయచోటి: బండరాయి కిందపడి వ్యక్తి మృతి

image

రాయచోటి మండల పరిధిలోని గొర్లముదివేడుకు చెందిన గౌనిపల్లి మల్లయ్య(55) రాళ్లను కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే గుట్ట వద్ద రాళ్లు కొడుతూ మట్టి తవ్వుతున్న క్రమంలో పెద్ద బండరాయి వచ్చి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News September 23, 2024

ప్రకాశం జిల్లాలో మెగా జాబ్ మేళా.. వివరాలివే.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. ‘మెగా జాబ్ మేళా’ నిర్వహించటం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 సం.లోపు యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నం: 9988853335

News September 23, 2024

నెల్లూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని బండగానిపల్లి గ్రామానికి చెందిన భేరి తిరుపాల్ రెడ్డి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్‌లో ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో పోస్ట్ చేశారనిఅన్నారు. అందుకు గాను ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

News September 23, 2024

పులివెందుల: అమల్లోకి లాక్ హౌసింగ్ మానిటర్ సిస్టం

image

పోలీసువారు అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఉచిత సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పీ మురళి నాయక్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో జరుగుతున్న దొంగతనాల నివారణకు ఎల్.హెచ్.ఎం.ఎస్ సిస్టమ్‌ను మీ ఇంటి నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు మొబైల్ యాప్ ద్వారా పోలీసులకు తెలపాలన్నారు.

News September 23, 2024

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

image

కలిగిరి మండలం లక్ష్మీపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కుమ్మరి కొండూరు నుంచి బైక్‌పై వస్తున్న రామస్వామి పాళెం గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, వంకదారి మాలాద్రిని లక్ష్మీపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.