Andhra Pradesh

News May 22, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

image

అనంతపురంలోని కురుగుంట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కమరుపల్లి గ్రామానికి చెందిన వంశీ, ప్రశాంత్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వంశీ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 22, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంబల్‌పూర్(SMP), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 23 నుంచి జూన్ 27 వరకు ప్రతి గురువారం SMP- SMVB(నం.08321), మే 25 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం SMVB- SMP(నం.08322) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News May 22, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘాటెక్కిన పచ్చి మిర్చి

image

నిత్యావసరంగా వాడుకునే పచ్చి మిర్చి ధర ఘాటెక్కింది. ఎన్నడూ లేని విధంగా యర్రగొండపాలెంలో కిలో పచ్చి మిర్చి రూ.100కి చేరింది. పశ్చిమ ప్రాంతంలో ఎక్కడా వేసవిలో మిర్చి సాగు చేయలేదు. పుల్లలచెరువు, మల్లపాలెం, నాయుడుపాలెం, చాపలమడుగు ప్రాంతాల్లో అరకొరగా సాగు చేశారు. దీంతో పచ్చిమిర్చిని మైదుకూరు నుంచి రోజుకు 50 క్వింటాళ్ల దిగుమతి చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.

News May 22, 2024

శ్రీకాకుళం: PGECET- 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల

image

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి తెలిపింది. కాగా PGECET పరీక్షను ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తామని APSCHE వర్గాలు స్పష్టం చేశాయి.

News May 22, 2024

విధులకు హాజరు కాని వారిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 79 మంది ఉపాధ్యాయులు, 21 మంది ఇతర శాఖలకు చెందిన అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. ఎందుకు హాజరు కాలేదని సంబంధిత అధికారులు మంగళవారం వారిని వివరణ కోరారు. వివరణ ఇవ్వని వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

News May 22, 2024

రక్తహీనతపై శ్రద్ధ వహించాలి: మన్యం కలెక్టర్

image

రక్తహీనతపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గర్భిణీలలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లిబిడ్డల నమోదు, కంటి వెలుగు, 108 వాహనాలు వంటి తదితర అంశాలపై సమీక్షించారు.

News May 22, 2024

మూడు బంగారు మెడల్స్ అందుకున్న నెల్లూరు విద్యార్థి

image

జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటిలో బుధవారం స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరులోని వి.మాలకొండ రెడ్డి నగర్‌కు చెందిన చందన గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మూడు గోల్డ్ మెడల్స్ అందుకుంది. చందన 2021-22 బ్యాచ్‌లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. చందన మాట్లాడుతూ.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా రాణించాలన్నది తన ఆశయమన్నారు.

News May 22, 2024

శ్రీకాకుళం: 24 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయని జిల్లా విద్యా శాఖాధికారి వేంకటేశ్వర రావు, పరీక్షల నిర్వహణధికారి అలీ ఖాన్ తెలిపారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాలలో సుమారు 2100 మంది పరీక్షలు రాయనున్నారని పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

News May 22, 2024

వైసీపీ పాలనకు అన్నదాతల ఆత్మహత్యలే నిదర్శనం: సత్యకుమార్

image

సీమవాడినని చెప్పుకోనే సీఎం జగన్.. ఐదేళ్లుగా సీమలో నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విమర్శించారు. రైతులకు వరం లాంటి బిందుసేద్యం పథకం అటకెక్కించారన్నారు. కరవు దెబ్బకు కుదేలైన రైతుకు సకాలంలో పంట నష్టపరిహారమైనా అందించి ఉంటే రైతుల ప్రాణాలు నిలిచేవన్నారు. ఉమ్మడి జిల్లాలో వారంలోనే అప్పులబాధ తాళలేక నలుగురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు.

News May 22, 2024

పిఠాపురం: వీరమహిళల సేవలు మరువలేనివి: పవన్

image

జనసేన గెలుపు కోసం ప్రచారం చేసిన పార్టీ వీరమహిళల సేవలు మరువలేనివని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ లేక విడుదల చేశారు. ‘పిఠాపురంలో నా తరఫున ఆడపడుచులు చేసిన ప్రచారం, అందించిన తోడ్పాటుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతిఒక్కరినీ గుర్తించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, వారిని బలమైన మహిళా నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను’ అని పవన్ లేఖలో పేర్కొన్నారు.