Andhra Pradesh

News May 22, 2024

సత్యసాయి జిల్లాలో 66.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 32 మండలాలకు గాను 6 మండలాలలో వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షపాతం మండలాలు వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. అమడగూరులో 20.5, ఓడిసిలో 16.2, గోరంట్లలో 11.0, తనకల్లులో 6.8, తలపులలో 6.2, నల్లచెరువు మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

News May 22, 2024

పర్చూరు: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

image

యద్దనపూడి -పోలూరు గ్రామాల మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాళ్ళూరి వినోద్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. దర్శిలో ఈయన MPP స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం బైకుపై పోలూరు వెళ్తుండగా గుంతలు తప్పించే క్రమంలో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

News May 22, 2024

BREAKING: గుంటూరులో పట్టపగలు దారుణ హత్య

image

గుంటూరులో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శారదా కాలనీ సమీపంలోని సంజీవనగర్ వద్ద బుధవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలుపు చొక్కా, గ్రే కలర్ ప్యాంటు ధరించిన ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా పొడిచి హత్య చేసి పరారైనట్లు తెలుస్తుంది. మృతుని వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News May 22, 2024

రేపల్లె: వ్యక్తి హత్య కేసులో నిందితులు అరెస్ట్

image

రేపల్లె మండలంలోని గుడ్డికాయలంకకు చెందిన యరగళ్ల <<13248511>>సుబ్బారావును హత్య చేసి తల తీసుకెళ్లిన కేసులో<<>>, నిందితులను అరెస్ట్ చేశామని పట్టణ సీఐ నజీర్ బేగ్ మంగళవారం తెలిపారు. విశ్వనాథపల్లి రాంప్రసాద్ (జగనన్న కాలనీ), బడుగు ఆదర్శ్ (రేపల్లె మండలం బేత పూడి)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రేపల్లె జగనన్న కాలనీ పక్కనున్న లేఅవుట్‌లో హత్య జరిగింది. కోర్టులో హాజరు పరిచామని సీఐ పేర్కొన్నారు.

News May 22, 2024

అనంత జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటల నష్టం రూ.1.84 కోట్లు

image

అనంత జిల్లాలో గాలివానతో కూడిన వర్షంతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరు, యాడికి, కూడేరు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, కుందుర్పి, శెట్టూరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో అరటి తోటలు నేలవాలగా, మామిడి, టమాటో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. 33మంది రైతులకు చెందిన 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ.1.84 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

News May 22, 2024

ఆర్చరీ ప్రపంచకప్‌లో విజయవాడ క్రీడాకారిణి వెన్నం జ్యోతి

image

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్‌లో నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘైలో స్టేజ్-1 టోర్నీలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన సురేఖకు మహిళల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో టాప్-3లో స్థానం కొద్దిలో చేజారింది. సురేఖ ప్రదర్శనతో టీమ్ విభాగంలో భారత్‌కు రెండో సీడింగ్ లభించింది. కాగా సురేఖ విజయవాడకు చెందిన క్రీడాకారిణి కావడం విశేషం.

News May 22, 2024

కనిగిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక మాచవరం జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాచవరం గ్రామానికి చెందిన రమాదేవి (45)మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మాచవరం నుంచి కనిగిరికి వస్తున్న వ్యానును మరో వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అన్నారు. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

కావలిలో యువతికి వేధింపులు

image

కావలి పట్టణంలోని ఓ వీధికి చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు వేధిస్తున్న ఘటనపై పోలీసు కేసు నమోదైంది. కొంతకాలంగా ఆ యువకుడు తనను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, కత్తితో బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 22, 2024

ఒంగోలుకు ఎంపీ మాగుంట రాక

image

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హైదరాబాదు నుంచి ఈనెల 23వ తేదీన ఒంగోలుకు రానున్నట్లు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. 23న ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో మాగుంట శ్రీనివాస రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాంనగర్ లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

News May 22, 2024

సింహ వాహనంపై పెంచల స్వామి విహారం

image

రాపూరు మండలం పెంచలకోనలో జరుగుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సింహ వాహన సేవ జరిగింది. నృసింహ జయంతి సందర్భంగా పెంచల స్వామికి విశేష పూజలు నిర్వహించారు. సింహ వాహనంపై కొలువై కోనలో విహరించిన శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం గరుడసేవ జరగనున్న నేపథ్యంలో పెంచలకోనకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.