Andhra Pradesh

News May 22, 2024

విశాఖ యువతను రప్పించేందుకు కంబోడియా ప్రభుత్వంతో చర్చలు

image

మానవ అక్రమ రవాణాపై కంబోడియా ప్రభుత్వంతో అక్కడున్న భారత దౌత్య కార్యాలయం చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. విశాఖకు చెందిన 150 మందిని సైబర్ క్రైమ్స్ కోసం సైబర్ నేరగాళ్లు ఏజెంట్ల ద్వారా అక్కడికి తీసుకువెళ్లారు. హింసలు పెడుతూ తినడానికి భోజనం కూడా పెట్టడం లేదు. ఈ విషయాన్ని నగర పోలీస్ అధికారులు భారత దౌత్య కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారిని ఇండియా రప్పించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు.

News May 22, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయని తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు తెలిపారు. అభ్యర్థులు వర్సిటీ అధికార వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అన్ని గ్రూపులకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 22, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్ష సూచన

image

ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్‌లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News May 22, 2024

ఈవీఎంల ధ్వంసం ఘటనలపై.. పల్నాడు ఎస్పీ ఆరా

image

పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనపై పల్నాడు ఎస్పీ మలికా గర్గ్ ఆరా తీశారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు, తుమ్మూరుకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను <<13290938>>పగలగొట్టిన దృశ్యాలు<<>> వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ రోజు జరిగిన ఘటనల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News May 22, 2024

కోనసీమ: ACCIDENT.. పెరిగిన మృతుల సంఖ్య

image

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ధాన్యం లోడు చేస్తుండగా ఈనెల 14వ తేదీన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడిన చిలకలపూడి సురేష్ (35) కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు అక్కడికక్కడే నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

News May 22, 2024

చీపురుపల్లి: ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

image

చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలోని జీడి మామిడి తోటలో మరువాడ లక్ష్మణరావు (25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం.. మృతుడు అదే గ్రామంలోని ఓ యువతితో ప్రేమలో పడినట్లు, వీరి ప్రేమకు అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కె కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.

News May 22, 2024

జంగారెడ్డిగూడెం: ACCIDENT

image

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనం ముందెళ్తున్న ఇటుక ట్రాక్టర్ నుంచి ఓ ఇటుక కిందపడగా దానిపై నుంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సాయంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.

News May 22, 2024

అనంతపురం: డిప్లమో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ షిప్

image

అనంతపురం పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో(మెకానికల్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు “మస్సాచు సిమిచ్చు” కంపెనీలో ఆరు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాంను అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర రెడ్డి తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు రూ.18వేల స్టైఫండ్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News May 22, 2024

సందర్శకులతో కిటకిటలాడుతున్న విశాఖ జూ

image

వేసవి సందర్భంగా విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్‌లో సందడి నెలకొంది. కొద్ది రోజులుగా జూ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు, పెద్దలు వందలాది మంది జూని సందర్శిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జూ పార్కుకు వస్తున్నారు. సందర్శకులు వన్యప్రాణులను తిలకిస్తూ ఆనందిస్తున్నారు.

News May 22, 2024

కడప : గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం

image

సివిల్స్, ఐఐటీ, నీట్ వంటి ఉన్నత చదువుల కోసం గ్రామీణ విద్యార్థులకు తమవంతు సహకారం అందిస్తామని పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఈనెల 26న 6నుంచి10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.00 గంటలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు.