Andhra Pradesh

News May 22, 2024

రాయచోటి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రాయచోటిలోని జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిటెండెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. ఈనెల 24 నుంచి జూన్ 1వరకు జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News May 22, 2024

పుట్టపర్తి: 24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ

image

పుట్టపర్తిలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7344మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.

News May 22, 2024

అనంతపురం: 8మంది జిల్లా బహిష్కరణ

image

అనంతపురం జిల్లాలో మట్కా, కర్ణాటక మద్యం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 8మందిని జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పలుమార్లు కేసులు నమోదుచేసినా తరచూ కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వారిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. అందులో అనంతపురం, బెలుగుప్ప, గార్లదిన్నె మండలాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు.

News May 22, 2024

తూ.గో.: పవన్ పోటీ.. అందరి చూపూ ఇటువైపే

image

ఉమ్మడి తూ.గో.లోని 19నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 14 చోట్ల గెలిచింది. 4 స్థానాల్లో టీడీపీ, ఒకచోట (రాజోలు) జనసేన పాగా వేసింది. తాజాగా పిఠాపురం నుంచి పవన్ పోటీచేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కాగా పొత్తులో భాగంగా జనసేన ఈ సారి 5 చోట్ల పోటీచేసింది. మరి గతంలో జనసేన గెలిసిన ఏకైక స్థానం ఈ జిల్లాలోనే కాగా.. ఈ సారి సీట్లు పెరిగేనా.?
– ఉమ్మడి తూ.గో.లో కూటమికి ఎన్నిసీట్లు రావొచ్చు..?

News May 22, 2024

ఆదోనిలో ఓటువేయడంలో వెనుకబాటు

image

సార్వత్రిక ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఆదోని నియోజకవర్గం ఓటర్లు ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆదోనిలో 66.5శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,63,058మంది ఓటర్లు ఉండగా..1,75,064మంది ఓటు వేశారు. 87,994మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.

News May 22, 2024

శ్రీకాకుళం: భర్తను చంపించిన భార్య

image

శ్రీకాకుళంలోని గూనపాలెంలో సురేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భార్య తిరుమలనే ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో హత్యకు భార్య ప్లాన్ చేసింది. ఈనెల 16న రాత్రి సురేశ్ తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. తర్వాత ప్రియుడికి సమాచారం అందజేసింది. అతను తన ఫ్రెండ్‌తో కలిసి సురేశ్ ఇంటికి వచ్చారు. అక్కడ అతడి గొంతు కోసి చంపేశారు.

News May 22, 2024

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 34 కేంద్రాలు

image

అనంతపురం జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డివీఈఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ప్రథమ సంవత్సరం 15,921, ద్వితీయ సంవత్సరం 5,017, వృత్తిపరమైన ప్రథమ సంవత్సరం 980, ద్వితీయ సంవత్సరం 592మంది హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

News May 22, 2024

గుంటూరు: వాయుసేనలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

భారత వాయు సేనలో అగ్ని వీర్ సైనిక ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. పదో తరగతి తత్సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. సంగీత ప్రావీణ్యం ఫ్లూట్, కీబోర్డ్, పియాసో మొదలైన వాటిలో ఏదైనా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. నేటి నుంచి జూన్ ఐదవ తేదీ వరకు https:///agnipathvayu.cdac.in ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

News May 22, 2024

మచిలీపట్నం: వాయుసేనలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

భారతీయ వైమానికదళం అగ్నివీర్ వాయు ‘సంగీతకారుల కోసం’ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ఆసక్తి గల అవివాహితులైన పురుషులు, మహిళలు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 10వ తరగతి చదివి ఆసక్తి కలిగిన యువతీ, యువకులు నేటి నుంచి https:///agnipathvayu.cdac.in వెబ్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

News May 22, 2024

ప.గో.: నాన్న తిట్టాడని SUICIDE

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.