Andhra Pradesh

News May 22, 2024

మచిలీపట్నం: వాయుసేనలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

భారతీయ వైమానికదళం అగ్నివీర్ వాయు ‘సంగీతకారుల కోసం’ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ఆసక్తి గల అవివాహితులైన పురుషులు, మహిళలు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 10వ తరగతి చదివి ఆసక్తి కలిగిన యువతీ, యువకులు నేటి నుంచి https:///agnipathvayu.cdac.in వెబ్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

News May 22, 2024

ప.గో.: నాన్న తిట్టాడని SUICIDE

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.

News May 22, 2024

కొత్తపట్నం: వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

image

వృద్ధురాలి హత్య కేసుకులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెడ్డిపాలేనికి చెందిన నాగరాజు, నాంచార్లు నిద్రిస్తున్న ఆమెను గొంతు నులిమి, ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

రాయదుర్గంలో NIA సోదాలకు కారణం ఇదే..

image

రాయదుర్గంలో మంగళవారం రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అతడి కొడుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి 7గంటలు విచారించారు. రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహైల్ స్నేహితుడిని NIA అధికారులు గుర్తించారు. అతడితో సోహైల్ హైదరాబాద్‌కు వెళ్లేవాడిని, పలుమార్లు వాట్సప్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయటం వంటివి NIA గుర్తించింది.

News May 22, 2024

సింహాచలం: నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం ఆలయంలో బుధవారం, గురువారం ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈనెల 22న శ్రీ నృసింహ జయంతి, స్వాతి నక్షత్ర హోమం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలు అన్నింటిని రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 23న వైశాఖ పౌర్ణమి కావడంతో గురువారం కూడా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 22, 2024

సింహాచలం: నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం ఆలయంలో బుధవారం, గురువారం ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈనెల 22న శ్రీ నృసింహ జయంతి, స్వాతి నక్షత్ర హోమం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలు అన్నింటిని రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 23న వైశాఖ పౌర్ణమి కావడంతో గురువారం కూడా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 22, 2024

రాజంపేట: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అన్నమయ్య జిల్లాలోని మూడు ప్రభుత్వ ఐటీఐలు, 12 ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు జూన్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్, రాజంపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కే. శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లె ప్రభుత్వ ఐటీఐలలో 392 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 1064 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News May 22, 2024

మార్కాపురం: బొలెరో లారీ ఢీ

image

మార్కాపురం మండలంలోని నికరంపల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ – బొలెరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనలో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

కానూరులో అదృశ్యమైన బాలిక వివరాలివే..

image

పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఆరేపల్లి వాగ్దేవి (8) మంళగవారం <<13291695>>రాత్రి అదృశ్యమైంది. <<>>తమ పాప కనబడుటలేదని తండ్రి నాగరాజు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెనమలూరు సీఐ రామారావు మీడియాకు తెలిపారు. పాప గురించి ఆచూకీ తెలిసినవారు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.

News May 22, 2024

నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు నిలిపివేసింది. శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు రూ.150కోట్లు బకాయిలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఆయా ఆసుపత్రుల యాజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.