India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్‌సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.
సోమశిల జలాశయంలో 74 TMCల నీటిమట్టం దాటితే నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 70 TMCల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసులకు సమాచారం చేరవేశారు. 11వ తేదీ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డ్యాంకు ప్రవాహం కొనసాగుతోంది.
ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్‌లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
అర్లీ ఖరీఫ్‌లో పండించిన ఉల్లి రైతులకు రూ.1,200 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రైతుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం యూరియా డిమాండ్, నిల్వలు, సరఫరాపై జేసీ అదితి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా ప్రాంతాల రైతు సేవా కేంద్రాలు, సంబంధిత డీలర్ల ద్వారా అందించామన్నారు. సరిపడా యూరియాను అందించేందుకు సిద్ధం చేశామన్నారు.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య డయల్ యువర్ కలెక్టర్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. ఎరువులు సంబంధిత విషయాలపై డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎరువులు, సంబంధిత విషయాలుపై ఈ కార్యక్రమం ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చును. ఫోన్ నంబర్ 09842 222565, 08942 222648లకు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.8,00 ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు
జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామన్నారు. ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అభ్యసించాలని అన్నారు. మంగళవారం ఒంగోలు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ‘లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులపై మాట్లాడారు. జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.
విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రాయలసీమ రాణీస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.
Sorry, no posts matched your criteria.